ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మా.. నేను కలెక్టర్‌ను

ABN, Publish Date - Mar 01 , 2025 | 12:42 AM

అమ్మా... నేను కలెక్టర్‌ను... రోజూ సరిపడా నీళ్లు వస్తున్నాయా..? అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్ట ర్‌ హనుమంతరావు స్థానికులతో ముచ్చటించారు. శుక్రవారం ఉదయం 5.30గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 16వ వార్డులో పర్యటించిన కలెక్టర్‌ హనుమంతరావు స్థానికులు ము ద్దం వెంకటేశ్‌, కవితల ఇంటికి వెళ్లి వారిని పలకరించారు.

రోజూ సరిపడా నీళ్లు వస్తున్నాయా..?

చౌటుప్పల్‌లో కలెక్టర్‌ పర్యటన

రోజు విడిచి రోజు వాటర్‌ ట్యాంక్‌లతో నీటిని సరఫరా చేయిస్తాం

చౌటుప్పల్‌ టౌన్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): అమ్మా... నేను కలెక్టర్‌ను... రోజూ సరిపడా నీళ్లు వస్తున్నాయా..? అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్ట ర్‌ హనుమంతరావు స్థానికులతో ముచ్చటించారు. శుక్రవారం ఉదయం 5.30గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలోని 16వ వార్డులో పర్యటించిన కలెక్టర్‌ హనుమంతరావు స్థానికులు ము ద్దం వెంకటేశ్‌, కవితల ఇంటికి వెళ్లి వారిని పలకరించారు. మీకు రోజూ సరిపడా నీళ్లు వస్తున్నాయా? అం టూ ప్రశ్నించగా మూడు నాలుగు రోజులకోసారి వస్తున్నాయని వారు సమాధానం ఇచ్చారు. స్థానిక వాటర్‌మెన్‌ శంకర్‌ను పిలిచి మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై కలెక్టర్‌ ఆరాతీశారు. 16వ వార్డులోని 10ఇళ్లకు పూర్తిగా నీరు సరఫరా కావడం లేదని, ఆ ఇళ్ల వైపు పైప్‌లైన్‌ సన్నగా ఉండడంతో నీరు వెళ్లడం లేదని, ఆ 10ఇళ్లకు రోజు విడిచి రోజు మిషన్‌ భగీరథ నీటిని సరఫరా చేయాలన్నారు. ఆర్‌వో ప్లాంట్‌ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, మిషన్‌ భగీరథ నీళ్లను వేడిచేసి చల్లార్చి తాగాలని కలెక్టర్‌ సూచించారు. నీళ్లను సరఫరా చేసే సమయంలో ఆటోలో మైక్‌ ద్వారా టాంటాం చేయాలని మునిసిప ల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను కలెక్టర్‌తనిఖీచేసి రోగులతో మాట్లాడారు. పారా మెడికల్‌ సిబ్బంది రోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. రోగులతో ఆప్యాయంగా మాట్లాడాలని, లేదం టే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గంగాధర్‌, మునిసిపల్‌ కమిషనర్‌ కె.నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ హరికృష్ణ పాల్గొన్నారు.

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

భువనగిరి (కలెక్టరేట్‌): ఈ నెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే ఇంటర్‌ ప్రఽథమ, ద్వితీయ సంవత్సరా ల పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఎం. హనుమంతరావు ఆధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన శుక్రవారం అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కే.గంగాధర్‌తో కలిసి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీ నుంచి 25 వరకు జరిగే వార్షిక పరీక్షలకు 12,558 మంది విద్యార్థులకు 29 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి రోజా రమణి, పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు మంజుల, ప్రభ జస్టీస్‌ అధికారులు పాల్గొన్నారు.

కష్టపడండి.. సైకిల్‌ పొందండి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో అత్యధిక మార్కులు (10జీపీఏ) సాధించే విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

(ఆంధ్రజ్యోతి, ఆలేరు): మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ హనుమంతరావు శుక్రవారం తనిఖీ చేశారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్‌ ప్రాజెక్టును పరిశీలించారు.

Updated Date - Mar 01 , 2025 | 12:42 AM