ఎమ్మెల్సీ పోలింగ్ 94.98శాతం
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:37 AM
శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 4.30గంటలోపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది.
మధ్యాహ్నానికి 79శాతం నమోదు
గతంలో కంటే పెరిగిన పోలింగ్ శాతం
3న కౌంటింగ్‌కు సన్నాహాలు
రెండో ప్రాధాన్య ఓట్లే కీలకమంటున్న విశ్లేషణలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో సాయంత్రం 4.30గంటలోపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి ఉమ్మడి జిల్లా లో 94.98శాతం పోలింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 8,331 ఓటర్లకు 7,913 ఓట్లు పోలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 950 ఓట్లు, నల్లగొండ జిల్లాలో 4,433 ఓట్లు, సూర్యాపేట జిల్లాలో 2,530 ఓట్లు పోలయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో మధ్యాహ్నానికే భారీగా ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10గంటలకు ఉమ్మడి జిల్లాలో 18.01శాతం, 12గంటలకు 51. 50శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నాం 2 గంటలకు 79.03 శాతం ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 94.98శాతం ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ జిల్లాలో 94.66 శాతం,సూర్యాపేట జిల్లాలో 94.97శాతం, యా దాద్రిజిల్లాలో 96.54 శాతం ఓట్లు పోలయ్యాయి.
2019 కంటే పెరిగిన పోలింగ్ శాతం
ఉపాధ్యాయ నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 92.66శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ ఎన్నికల్లో స్వల్పంగా పెరిగి 94.98శాతం పోలింగ్ నమోదైంది. 2019 లో ఉమ్మడిజిల్లాలో 7,362ఓట్లకు 6,822 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 92.66 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 8,331 ఓట్లకు 7,913 ఓట్లు పోలయ్యాయి. 94.98శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్లు, ఎస్పీలు, సంఘాల నేతలు
ఉమ్మడి జిల్లాలో గురువారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, ఉపాధ్యా య ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నా రు. పోలింగ్ సరళిని, పోలింగ్ తీరును నల్లగొం డ కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టరేట్‌లోని ఎన్నికల కౌంటర్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా వరంగల్, ఖమ్మం, సహా అన్ని జిల్లాల్లో పరిస్థితి ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు. నల్లగొండ పట్టణంలోని పోలింగ్ ...కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఎస్పీ శరత్‌చంద్రపవార్ సైతం నల్లగొండలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతపై పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. అదేవిధంగా పోలింగ్ సరళిని యాదాద్రి, సూర్పాపేట జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు.
బ్యాలెట్లు భద్రంగా స్ట్రాంగ్ రూమ్‌లో..
నియోజకవర్గంలోని మొత్తం 200 పోలిం గ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిశాక పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు. ఈ బాక్సులన్నింటినీ అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్ట పోలీ్‌సబలగాల భద్రత నడు మ నల్లగొండలోని స్టేట్‌వేర్ హౌసింగ్ గోదాములకు గురువారం రాత్రికే తరలించారు. ఈనెల 3న కౌంటింగ్‌కు ఇప్పటికే సన్నాహాలు పూర్తయ్యాయి. కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డ్మ్ రిజర్డ్వ్ బలగాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఓట్ల కోసం ప్రతినిధుల తాపత్రయం
పోలింగ్ కేంద్రాలకు సమీపంలో పోల్‌చిట్టీలు అందజేసిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన ప్రతినిధులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు చివరి నిమిషం వరకు వారి అభ్యర్థికి ఓట్లేయాలని కోరుతూ ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ప్రత్యేకంగా శిబిరాల వద్ద పోల్‌చీటీలు అందిస్తూ వారి అభ్యర్థికి ఓటేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. మధ్యాహ్నం తర్వాత ఓటేయని వారిని గుర్తించి సంఘాల నాయకులు ఫోన్లు చేసి, వాహనాలు పంపి వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మొత్తంగా చివరి నిమిషం వరకు ఓట్ల కోసం సంఘాల నాయకులు, అభ్యర్థుల తరుపు ప్రతినిధులు తాపత్రయపడ్డారు.
రెండోసారి తలపడుతున్న అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్
ఈ ఎన్నికలో పోటాపోటీగా తలపడ్డ నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ గత ఎన్నికల్లోనూ తలపడ్డారు. 2019 ఎన్నికల్లో వీరిద్దరే ప్రధాన ప్రత్యర్థులు కూడా. 2013 ఎన్నికల్లో పీఆర్‌టీయూ మద్దతుతో పూల రవీందర్ అప్పటి యూటీఎఫ్ అభ్యర్థి నాగెళ్ల నారాయణపై గెలుపొందారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి పీఆర్‌టీయూ నుం చి మరోసారి పూలరవీందర్ బరిలో నిలవగా, బీఆర్‌ఎస్ సైతం ఆయనకు అధికారికంగా మద్ద తు ప్రకటించింది. ఆ ఎన్నికలో యూటీఎఫ్ అభ్యర్థిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి తలపడగా, నర్సిరెడ్డి గెలుపొందారు. తాజాగా, జరిగిన ఎన్నికలో నూ నర్సిరెడ్డి మరోసారి యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలవగా, పూల రవీందర్ బీసీ సంఘాలు, బహుజనసంఘాల అభ్యర్థిగా పోటీచేశారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మొదటి మూడు ఎన్నికల్లో యూటీఎఫ్, పీఆర్‌టీయూ నడుమనే ప్రధాన పోరు సాగింది. మొదటి ఎన్నికలో చుక్కా రామయ్యకు యూటీఎఫ్ సహా అన్ని వామపక్ష సంఘాలు మద్దతివ్వగా, ఆయన పీఆర్‌టీయూ అభ్యర్థి ధర్మారెడ్డిపై గెలిచారు. ఆతర్వాత 2013 ఎన్నికలో పీఆర్‌టీయూ నుంచి రవీందర్ గెలవగా, ఆయనకు యూటీఎఫ్ అభ్యర్థి నారాయణపోటీ ఇచ్చారు. 2019లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి గెలవగా, పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్ పోటీ ఇచ్చారు. ఈసారి హోరాహోరీగా పోరుసాగడంతో బహుముఖ పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు చివరివరకు పోటీ ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఆ ఓట్లు ఎవరికి దక్కితే వారిదే విజయం!
ఉపాధ్యాయ సంఘాలు హోరాహోరీగా పోరాడిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో అభ్యర్థుల నడుమ బలమైన పోటీ కొనసాగింది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీచేసిన ఈ నియోజకవర్గంలో పింగళి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్), అలుగుబెల్లి నర్సిరెడ్డి (సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎఫ్), పూలరవీందర్ (మాజీ ఎమ్మెల్సీ, బీసీ జేఏసీ), గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి (టీపీసీసీ అధికారప్రతినిధి, టీపీఆర్‌టీయూ), పులి సర్వోత్తంరెడ్డి (బీజేపీ), సుందర్‌రాజ్‌యాదవ్‌కు మొదటి ప్రాధాన్య ఓట్లు ఎక్కువగా పోలైనట్టు ఉపాధ్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది. అన్ని జిల్లాల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు వారి సంఘం బలపరచిన అభ్యర్థికే వస్తాయని దాదాపు మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలుస్తామని పీఆర్‌టీయూ సంఘం నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండగా, తమ సంఘం సంప్రదాయ ఓటింగ్‌తో పాటు నిజాయితీగా ఉపాధ్యాయ సమస్యలపై స్పందించినేతగా తమ అభ్యర్థికే విజయం దక్కుతుందని యూటీఎఫ్ నాయకులు చెబుతున్నారు. బహుజన, బీసీ వాదంతో గెలుపు తమకే దక్కుతుందని, బీసీ, బహుజనుల్లో సానుకూల ఓటింగ్ కొనసాగిందని, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలవబోతున్నామని పూల రవీందర్‌కు మద్దతు ఇచ్చిన బీసీ, బహుజన సంఘాలు పేర్కొంటున్నాయి. టీపీఆర్‌టీయూ నేతలు సైతం గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషా పండితులు, ఆదర్శ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయ ఓట్లలో తమకే గణనీయంగా వచ్చాయని, హైస్కూల్ టీచర్లలోనూ తమ వాటా ఓట్లు తమకు పడ్డాయని, గెలుపు తమ అభ్యర్థి హర్షవర్థన్‌దేనని పేర్కొంటుంటే, ఈ వర్గాల ఓట్లతో పాటు మొత్తం నియోజకవర్గంలో జాతీయవాద భావజాలమున్న ఉపాధ్యాయులంతా తమకే ఓటేశారని, గెలుపు తనదేనని బీజేపీ శిబిరం చెబుతోంది. మొత్తంగా అత్యంత హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో మొదటి ప్రాధాన్య ఓట్లలోనే కోటా ఓటు సాధ్యం కాదని, ద్వితీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఫ మొత్తం ఓట్లలో సగానికిపైగా ఓట్లు హైస్కూల్ విద్యాసంస్థలు, ఆపై ఇంటర్, డిగ్రీ, యూనివర్శిటీ విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు ఉుండగా, మిగిలిన సగం ఓట్లు కేజీబీవీలు, గురుకులాలు, ప్రైవేట్ టీచర్లు, ఆశ్రమ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలలో దాదాపు సగం ఓట్లున్నాయి. హైస్కూల్, ఆపై స్థాయి విద్యాసంస్థల్లోని ఓటర్లలో సంఘాల ప్రభావంతో పాటు, అభ్యర్థుల చరిష్మాతో దాదాపుగా ప్రధాన అభ్యర్థులందరికీ సమంగా ఓట్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ఓట్లలో ఎక్కువగా ఎవరికి పడితే వారే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని, ఈ ఓట్ల కోసం ప్రధాన అభ్యర్థులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేయడమే అందుకు నిదర్శనమని, ఓటర్ల తీర్పే విజేతను నిర్ణయిస్తుందని ఉపాధ్యాయవర్గాల్లో విశ్లేషణ నడుస్తోంది. వీటితో పాటు గత ఎన్నికలకు భిన్నంగా ఈ ఎన్నికలో డబ్బు, దావత్‌ల ప్రభావం కూడా మితిమీరందని ఉపాధ్యాయవర్గాల్లో ఆందోళన వ్యక్తమయింది. అనారోగ్యకరమైన వాతావరణాన్ని మేధావి వర్గంలో చొప్పించారని, ఈ ప్రభావం ఓటర్లను సైతం ఇబ్బందికి గురిచేసిందని, గెలుపోటములను డబ్బు పంపిణీ ప్రభావితం చేసిందనే అంచనా కనిపిస్తోందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ సాగుతోంది.
పెరిగిన 4శాతం పోలింగ్
యాదాద్రి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో గతంతో పోలిస్తే 4శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 92.65శాతం పోలింగ్ నమోదుకాగా, ప్రస్తుత ఎన్నికలో 96.54 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం ఓటర్లు 984మంది ఉండగా, 950మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 638 మంది, మహిళలు 346 మంది ఉన్నారు. వీరిలో 623మంది పురుషులు, 327మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 7గంటల నుంచి 4వరకు జరిగిన ఎన్నికల్లో ఉదయం మందకొడిగా సాగినా, మధ్యాహ్నానికి ఊపందుకుంది. అప్పటివరకు పోలింగ్ కేంద్రాల వద్ద కూర్చోని ప్రచారం చేసిన ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా ఓటేశారు. ఉదయం 10గంటల వరకు 16.16శాతం ఓటింగ్, మధ్యాహ్నం 12గంటల వరకు 48.58శాతం, 2గంటల వరకు 83.43 శాతం, 4గంటల వరకు 96.54శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ సరళి తీరును కలెక్టర్ ఎం.హనుమంతరావు పరిశీలించారు. భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల, పో చంపల్లిలో ని జడ్పీ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి ఆలేరులోని జిల్లా పరిషత్ పాఠశాలలోని పోలింగ్ స్టేషన్ సందర్శించి ఎన్నికల సిబ్బందికి సూచనలు చేశారు. బొమ్మలరామారం, గుండాల, రాజపేట మండలాల్లోని పోలింగ్ స్టేషన్లలో 100శాతం పోలింగ్ నమోదైంది. 17 పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సును జిల్లా కేంద్రంలోని భువనగిరి జూనియర్ కళాశాలకు, అనంతరం అన్ని బ్యాలెట్ బాక్సులను నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. పోలింగ్ కారణంగా కేంద్రాల వద్ద 400మీటర్ల వరకు ప్రచారం చేపట్టకుండా బీఎన్‌ఎ్‌స సెక్షన్ 163 అమలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఉద యం నుంచి 4గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేశారు.
2025లో.. 2019లో..
జిల్లా మొత్తం పోలైన పోలింగ్ మొత్తం పోలైన పోలింగ్
ఓటర్లు ఓట్లు శాతం ఓటర్లు ఓట్లు శాతం
నల్లగొండ 4683 4433 94.66 3859 3583 92.85
సూర్యాపేట 2664 2530 94.97 2183 2016 92.35
యాదాద్రి 984 950 96.54 1320 1223 92.65
సిద్దిపేట 166 156 93.98 163 142 87.11
జనగామ 1002 945 94.31 853 768 90.06
హనుమకొండ 5215 4780 91.66 4315 3838 88.95
వరంగల్ 2352 2214 94.13 805 697 86.63
మహబూబాబాద్ 1663 1571 94.47 1087 957 88.04
జె.భూపాలపల్లి 329 308 93.62 162 136 83.25
ములుగు 628 583 92.83 464 414 89.22
భద్రాద్రి 2022 1858 91.94 2043 1797 87.96
ఖమ్మం 4089 3804 93.03 3634 3315 91.22
మొత్తం 25,797 24,133 93.55 20,888 18,886 89.25
జిల్లా మొత్తం 10 12 2 పోలింగ్ ముగిసే
ఓట్లు గంటలకు గంటలకు గంటలకు సమయానికి
యాదాద్రి 984 159 (16.16) 478 (48.58) 821 (83.43) 950 (96.54)
సూర్యాపేట 2664 391 (14.68) 1213 (45.53) 1988 (74.62) 2530 (94.97)
నల్లగొండ 4683 951 (20.31) 2598 (55.48) 3775 (80.61) 4433 (94.66)
మొత్తం 8331 1501 (18.01) 4289 (51.50) 6584 (79.03) 7913 (94.98)
Updated Date - Feb 28 , 2025 | 12:37 AM