మొదటి రోజే భారీగా గైర్హాజరు
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:52 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు తొలిరోజే విద్యార్థులు భారీగా గైర్హాజరయ్యారు.
నల్లగొండ, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు తొలిరోజే విద్యార్థులు భారీగా గైర్హాజరయ్యారు. సోమవారం నుంచి ఒకేషనల్, జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 942 విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్, కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పాటు గురుకుల జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు రెండు పూటలా పరీక్షలు నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలో
నల్లగొండ జిల్లాలో మొత్తం జనరల్, ఒకేషనల్ విభాగంలో కలిపి 446 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన జనరల్ విభాగంలో 1,257 మందికి గాను 1,214 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,375 మంది విద్యార్థులకు 1161 మంది హాజరు కాగా 211 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన జనరల్ , ఒకేషనల్ విభాగాల్లో ప్రయోగ పరీక్షకు విద్యార్ధులు 2012 మందికి 1,915మంది హాజరు కాగా 96మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 833 మంది విద్యార్థుకు గాను 820మంది హాజరయ్యారు. 12మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,179మంది విద్యార్థులకు 1095మంది హాజరు కాగా 84 మంది గైర్హాజరయ్యారు.
యాదాద్రిభువనగిరి జిల్లాలో
భువనగిరి టౌన, ఫిబ్రవరి (ఆంధ్రజ్యోతి) : యాదాద్రిభువనగిరి జిల్లా వ్యాప్తంగా 42 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ జనరల్, ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగింది. మొదటి రోజు 115 మంది గైర్హాజరయ్యారు. జనరల్ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో 586 మందికి గాను 579 మంది హాజరు కాగా 7 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షలకు 1,564 మందికి గాను 1456 మంది హాజరు కాగా 108 మంది గైర్హాజరయ్యారు. అయితే ఈ నెల 3 నుంచి 22 వరకు మూడు దఫాలుగా రెండు పూటలా జరుగనున్న ప్రాక్టికల్స్‌కు జనరల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు 6,200మంది హాజరు కావాల్సి ఉంది. ఇంటర్ నోడల్ అధికారి సీ రమణితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పరీక్షల విభాగం అధికారులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
సూర్యాపేట జిల్లాలోనూ...
భానుపురి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : సూర్యాపేట జిల్లాలో ప్రాక్టికల్స్ పరీక్షలకు 381 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 44 కేంద్రాలను కేటాయించగా అందులో 7 ప్రభుత్వ, 15 ప్రభుత్వ రంగ సంస్థల్లో, 22 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు ఒకేషనల్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1086 మంది హాజరుకావాల్సి ఉండగా 872 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. 214 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 918 మందికి 883 మంది మాత్రమే పరీక్షకు హాజరు కాగా 35 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 985 మందికి 888మంది హాజరు కాగా 97 మంది ప్రాక్టికల్స్ రాయలేదు. జనరల్ విద్యార్థులు 718 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 683 మంది మాత్రమే రాశారు. 35 మంది ప్రాక్టికల్స్‌కు గైర్హాజరయ్యారని సూర్యాపేట జిల్లా అధికారి భానునాయక్ తెలిపారు.
Updated Date - Feb 04 , 2025 | 12:52 AM