ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిధులను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Feb 28 , 2025 | 12:39 AM

ఆస్పత్రుల నిర్వహణకు, వైద్యసేవలకు 15వ ఆర్థిక సంఘం అందిస్తున్న నిధులను సద్వినియోగపర్చుకోవాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎ్‌ఫపీ)అధికారి డాక్టర్‌ మితాచౌదరి అన్నారు.

ఎన్‌ఐపీఎ్‌ఫపీ అధికారి మితా చౌదరి

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి27(ఆంద్రజ్యోతి): ఆస్పత్రుల నిర్వహణకు, వైద్యసేవలకు 15వ ఆర్థిక సంఘం అందిస్తున్న నిధులను సద్వినియోగపర్చుకోవాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎ్‌ఫపీ)అధికారి డాక్టర్‌ మితాచౌదరి అన్నారు. వైద్యారోగ్య శాఖకు 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులు జిల్లాలో వినియోగంపై పరిశీలించేందుకు ఆర్థిక సంఘం, ఎన్‌ఐపీఎ్‌ఫపీ బృందాలు గురువారం భువనగిరి జిల్లా ఆస్పత్రి, టీ హబ్‌, బస్తీ దవాఖానాలు, వలిగొండ, అరూర్‌ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలను సందర్శించాయి. ముందుగా జిల్లా వైద్యశాఖ, జిల్లా ఆసుపత్రి అధికారులతో వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి, టీ.హబ్‌ నిర్వహణ తీరు, భవనాల నిర్మాణం, ఆరోగ్యమందిరాల్లో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐపీఎ్‌ఫపీ అధికారి డాక్టర్‌ మితా చౌదరి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య మౌలిక వసతులను మెరుగుపర్చాలన్నారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ వైద్యసేవలు అందించడంలో చిత్తశుద్ది చూపాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వికేంద్రీకణ చేస్తూ ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ఆర్థిక సంఘం లక్ష్యమన్నారు. డీఎంహెచ్‌వో మనోహర్‌, డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ శ్రీశైల చిన్నానాయక్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ శిల్పిని, డాక్టర్‌ యశోద, అధికారులు డాక్టర్‌ సాయి శోభ, డాక్టర్‌ సుమన్‌ కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 12:39 AM