ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలి

ABN, Publish Date - Jan 12 , 2025 | 12:51 AM

ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేయాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళు,్ల రేషన్‌ కార్డులపై అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కే.గంగాధర్‌లతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

భువనగిరి (కలెక్టరేట్‌), డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేయాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళు,్ల రేషన్‌ కార్డులపై అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కే.గంగాధర్‌లతో కలిసి శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభు త్వం అమలు చేయనున్న పథకాల మార్గదర్శకాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు భరోసా జాబితాలో చేర్చాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన నిరుపేదలకు కేటాయించే లా జాబితా సిద్ధం చేయాలన్నారు. రేషన్‌ కార్డులకోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ 15వ తేదీ నుంచి చేపట్టి, 16వ తేదీ నుంచి 20వ తేదీ లోగా ఎంపిక చేయాలన్నారు. 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి పథకాలపై చా టింపు వేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌. శోభారాణి, ఆర్డీవోలు శేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, డీపీవో సునంద, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.

వడ్డె ఓబన్న చరిత్ర చిరస్మరణీయం

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న వీరోచిత చరిత్ర చిరస్మరణీయమని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న 218వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వీరారెడ్డి, కే. గంగాధర్‌, జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి యాదయ్య, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లపు బాలయ్య, బొంత సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:52 AM