మోత్కూరు నియోజకవర్గం ఏర్పాటుకు కృషి
ABN, Publish Date - Jan 28 , 2025 | 12:10 AM
నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరును నియోజకవర్గంగా ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గం వీడ్కోలు సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు
మోత్కూరు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరును నియోజకవర్గంగా ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. సోమవారం మునిసిపల్ కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గం వీడ్కోలు సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎంతో చరిత్ర ఉన్న మోత్కూరును నియోజకవర్గంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమ్మనబోలు, వేములకొండ మండలాలుగా ఏర్పాటయ్యే అవకాశముందన్నారు. మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆత్మకూరు(ఎం)తో పాటు సమీపంలోని ఒకటి రెండు మండలాలను కలిపి నియోజకవర్గం చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గత ఏడాది జనవరి వరకు నాలుగేళ్లు ఉన్న బీఆర్‌ఎస్ చైర్మన్ మునిసిపాలిటీలో ఏం పనులు నిర్వహించకపోవడంతో అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఆ తరువాత గుర్రం కవిత చైర్‌పర్సన్ అయ్యాక ఏడాది కాలంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. ప్రధాన రహదారి నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. బిక్కేరు వాగుపై రెండు వరుసల బ్రిడ్జి నిర్మాణానికి రూ.28కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. మినీ స్టేడియం, కళాశాల భూములు అన్యాక్రాంతం కానివ్వనన్నారు. మోత్కూరుకు ఆర్టీసీ బస్సు డిపో, 30 పడకల ఆస్పత్రి తప్పక మంజూరవుతాయన్నారు. మునిసిపాలిటీల్లోని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేసేలా కృషి చేస్తానన్నారు. గంధమల్ల రిజర్వాయర్ నుంచి యాసంగికి బిక్కేరు వాగులోకి నీటి విడుదల చేయించానని, రెండు, మూడు రోజుల్లో అవి మోత్కూ రు వరకు వస్తాయన్నారు. అనంతరం కాంగ్రె్‌సలో చేరిన 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్‌చక్రవర్తికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
క్రీడా, సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలి
ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో మోత్కూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీలను, ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేలు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆట స్థలాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కూరెల్ల ఉప్పలయ్యను పరామర్శించి రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు.
Updated Date - Jan 28 , 2025 | 12:10 AM