ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాంస్కృతికోత్సవాలను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Jan 24 , 2025 | 12:49 AM

మోత్కూరు మండల కేంద్రంలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాలను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సామేలు

మోత్కూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మండల కేంద్రంలో ఫిబ్రవరి 8 నుంచి 10 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతికోత్సవాలను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కోరారు. గురువారం మోత్కూరు ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడా, సాంస్కృతికోత్సవాల ప్రచార కరపత్రాలను ఆయన విడుదల చేసి మాట్లాడారు. మోత్కూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ, వాలీబాల్‌ క్రీడా పోటీలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారన్నారు. అందుకనుగుణంగా గ్రామీణ, పట్టణ క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయడానికి తన ఆధ్వర్యంలో క్రీడా, సాంస్కృతికోత్సవాలకు శ్రీకారం చుట్టానన్నారు. కబడ్డీ, వాలీబాల్‌ క్రీడా పోటీలు పురుషులకు, మహిళలకు వేర్వేరుగా నిర్వహిస్తామన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.లక్ష నగదు, ద్వితీయ బహుమతి రూ.75వేలు, తృతీయ బహుమతి రూ.50వేలు, చతుర్ధ బహుమతి రూ.25 వేలతో పాటు అన్ని విజేత జట్లకు కప్‌ అందజేస్తామన్నారు. షటిల్‌ ఓపెన్‌ టు ఆల్‌ పోటీలో విజేతలకు మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు కప్‌, మార్చ్‌ఫాస్ట్‌ విన్యాసాలకు ప్రత్యేక బహుమతులు ఇస్తామన్నారు. సాంస్కృతిక పోటీల విజేతలకు కూడా నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు అందిస్తామన్నారు. మోత్కూరు ఉన్నత పాఠశాల, మినీస్టేడియం స్థలంలో నిర్వహించనున్న ఈ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో అధికంగా జట్లు పాల్గొనేలా కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం కవిత, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంఈవో టి.గోపాల్‌రెడ్డి, సినీగేయ రచయిత అభినయ శ్రీనివాస్‌, ఎస్‌ఎన్‌చారి, సతీష్‌, దేవా, డి.అరవిందరాయుడు, టి.ఉప్పలయ్య, ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపాళ్లు బి.రవీందర్‌రెడ్డి, పి.మరియన్న, ఎం.రాజిరెడ్డి, ఓ.సత్యనాథ్‌, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కంచర్ల యాదగిరిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, నగేష్‌, ఎం.సురేష్‌, శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 12:49 AM