ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ విమర్శలు

ABN, Publish Date - Feb 08 , 2025 | 12:41 AM

తమ రాజకీయ ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు.

సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతున్న రమే్‌షరెడ్డి

సూర్యాపేట టౌన, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : తమ రాజకీయ ఉనికి కోసమే బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన పటేల్‌ రమే్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వేల మంది అధికారులతో రాష్ట్రంలో కులగణన చేపట్టి వివరాలు వెల్లడిస్తే కేవలం పత్రికల్లో తమ పేరును చూసుకునేందుకు కొంతమంది బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే కనీసం వారి తరుపున మాట్లాడకుండ ఫాంహౌ్‌సకే పరిమితం అయ్యాడన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిందన్నారు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిందేమీలేదన్నారు. దేశ అభివృద్ధి కాంగ్రె్‌సతోనే సాధ్యమన్నారు. రాబోయే స్థానికసంస్థల ఎన్నికలో కాంగ్రె్‌సదే గెలుపన్నారు. కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్‌, షఫిఉల్లా, వెలుగు వెంకన్న, వల్దాస్‌ దేవేందర్‌, పిల్లల రమే్‌షనాయుడు, సోమయ్య, యాటవెంకన్న, అంజయ్య,ఉపేందర్‌, కర్ణాకర్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:41 AM