ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తప్పదు

ABN, Publish Date - Feb 19 , 2025 | 12:51 AM

రెండు పంటలకు సమృద్ధిగా కేసీఆర్‌ నీళ్లిస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం పంటలు ఎండుతున్నాయని, కాంగ్రె్‌సకు రైతుల ఉసురు తప్పదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సూర్యాపేటలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్‌ను తిడితే ఏమీ ఒరగదు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సూర్యాపేట టౌన, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): రెండు పంటలకు సమృద్ధిగా కేసీఆర్‌ నీళ్లిస్తే, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాత్రం పంటలు ఎండుతున్నాయని, కాంగ్రె్‌సకు రైతుల ఉసురు తప్పదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతరను పురస్కరించుకుని మంగళవారం ఆమె బోనం ఎత్తుకుని మెట్లమార్గంలో గుట్టపైకి వచ్చి సౌడమ్మ తల్లికి సమర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పాలన సాగిస్తే ప్రస్తుత సీఎం రేవంతరెడ్డి ఢిల్లీకి వెళ్లడం.. లేదంటే కేసీఆర్‌ను తిట్టడం మినహా ఏమీచేయడం లేదన్నారు. మహిళా సంక్షే మంపై ఒక్కసారి కూడా సీఎం సమీక్ష చేయలేదన్నారు. మహిళలపై క్రైం రేటు 20శాతం పెరిగిందని, మతకల్లోలాలు పెరిగాయన్నారు. గందరగోళం సృష్టించి బీసీ జనాభా లెక్కలు తక్కువగా చూపిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు తెచ్చిన ఘనత బీఆర్‌ఎ్‌సకే దక్కిందన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ -2లో కేసీఆర్‌ హయాంలో రెండు పంటలకు నీళ్లిచ్చామని, ఇప్పుడు ఎందుకు నీళ్లివ్వడంలేదో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. లోక్‌సభలో తెలంగాణ ప్రకటించిన నేటి రోజు లింగమంతులస్వామి జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్‌, బొల్లం మల్లయ్యయాదవ్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే పెద్దగట్టు అభివృద్ధి: ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌

బీఆర్‌ఎస్‌ హయాంలోనే పెద్దగట్టు శ్రీలింగమంతులస్వామి ఆలయ అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. మంగళవారం పెద్దగట్టు జాతరకు హాజరై ప్రత్యేకపూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. పెద్దగట్టు అభివృద్ధికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జాతరకు రూ.5కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం ఆ నిధులతో ఏ పనులు చేశారో నేటికీ తెలపకుండా పక్కదారి పట్టిస్తోందన్నారు.

Updated Date - Feb 19 , 2025 | 12:51 AM