మోసగించడంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే
ABN, Publish Date - Jan 11 , 2025 | 12:49 AM
ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.
సూర్యాపేట(కలెక్టరేట్), జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సీఎం రేవంత, కేసీఆర్ కుటుంబం మధ్య ఏదో ఒప్పందం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మాటలకు స్పంది ంచిన ఆయన శుక్రవారం సాయం త్రం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంతరెడ్డిని తిడితే కాంగ్రెస్ నాయకులకు రాని కోపం కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు ఎందుకని ప్రశ్నించారు. రేవంతరెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు ప్రేమ పొంగుకొస్తుందని, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటని దుయ్యబట్టారు. బండి సంజయ్‌ది నిజంగా బీజేపీ రక్తమైతే రేవంతరెడ్డి ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు. ఫార్ములా రేస్ కొనసాగితే గ్రీనకో కంపెనీకి ఏమైనా లాభం కలిగి అప్పుడు ఏదైనా అవినీతి జరిగే అవకాశం ఉండేది, కానీ రేస్ కొనసాగించకపోవడంతోనే గ్రీనకో కంపెనీకి నష్టం జరిగింది అలాంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలన్నారు. చివరకు ఫార్ములా రేస్ కేసులో సీఎం రేవంతరెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని, ఇది రాసిపెట్టుకోవాలన్నారు. సమావేశంలో జీడి భిక్షం, తూడి నర్సింహారావు, తాహేర్‌పాష, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, సోమరాజ్ పాల్గొన్నారు.
Updated Date - Jan 11 , 2025 | 12:49 AM