ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జాతరకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

ABN, Publish Date - Feb 01 , 2025 | 12:31 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.

గుట్టపైకి వెళ్లేదారి ఏర్పాటు చేసిన ఆర్చీ

(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి)

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 2 నుంచి 9 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతీ ఏటా మాఘుశుద్ధ సప్తమి మొదలుకొని త్రయోదశి వరకు వారం రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతీ రోజూ పెద్దసంఖ్యలో వచ్చే భక్తుల కోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర నేపథ్యంలో చెర్వుగట్టుపైన ఉన్న ప్రధానాలయాలతో పాటు ఉపాలయాలను గుట్ట కింద ఉన్న పార్వతీదేవీ ఆలయానికి రంగులద్దే పనులు కొనసాగుతున్నాయి. విద్యుద్దీపాలతో ప్రధానాలయ విమాన గోపురాలు, రాజగోపురాలను అలంకరించారు. ఘాట్‌రోడ్‌ ప్రవేశ ద్వారం వద్ద ఇప్పటికే ఆర్చిని ఏర్పాటుచేశారు. నల్లగొండ పట్టణంతో పాటు నార్కట్‌పల్లి మండలకేంద్రంలోని నల్లగొండ క్రాస్‌ రోడ్డు సమీపంలో భక్తులను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఆర్చిని ఏర్పాటుచేశారు. నల్లగొండలో ఈ నెల 2న నగరోత్సవంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే చెర్వుగట్టులో జాతర సందడి నెలకొంది. దుకాణాల ఏర్పాటు, భక్తుల కావల్సిన మౌలిక సదుపాయాల కల్పనలో లోటుపాట్లు లేకుండా ఇప్పటికే పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి ఓ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

చెర్వుగట్టు హుండీ కానుకలు రూ.30,26,960

నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ కానుకలను లెక్కించారు. 48 రోజులకు సంబంధించి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయం రూ.30,26,960లు లభించినట్లు ఈవో సిరికొండ నవీనకుమార్‌ తెలిపారు. గుట్టపైన స్వామివారి ప్రధానాలయంతో పాటు ఉపాలయాల వద్ద ఉన్న హుండీలను తెరిచి కానుకలను లెక్కించగా రూ.26,53,960లు, గుట్ట కింద పార్వతీ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న హుండీల కానుకలు రూ.3,73,000లు కలిపి రూ.30,26,960 లభించినట్లు తెలిపారు. అదేవిధంగా నిత్యాన్నదానం హుండీలో రూ.29,740లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇనస్పెక్టర్‌ బీ సుమతి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంద్రసేనారెడ్డి, ఇతర సిబ్బంది, నందిగామకు చెందిన శ్రీ దుర్గ శివసాయి సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 12:31 AM