రైల్వేస్టేషన్లలో నగదు రహిత టికెట్ సేవలు
ABN, Publish Date - Jan 31 , 2025 | 12:43 AM
ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లలో నగదురహిత టికెట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు గుంటూరు డివిజన్ కర్షియల్ మేనేజర్ కమలాకర్‌బాబు తెలిపారు. గురువారం మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు నగదురహిత టికెట్ బుకింగ్ సేవలపై అవగాహన కల్పించారు.
డీసీఎం కమలాకర్‌బాబు
మిర్యాలగూడ, మిర్యాలగూడ అర్బన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేస్టేషన్లలో నగదురహిత టికెట్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు గుంటూరు డివిజన్ కర్షియల్ మేనేజర్ కమలాకర్‌బాబు తెలిపారు. గురువారం మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు నగదురహిత టికెట్ బుకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూటీఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్లు బుక్‌చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా ప్రయాణికులు క్యూలైన్‌లో నిలబడకుండానే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు పొందే అవకాశం కల్పించామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ఆన్‌లైన్ సేవలను దక్షిణమధ్య రైల్వేశాఖ అందుబాటులోకి తెస్తోందన్నారు. అనంతరం మొబైల్ టికెటింగ్ విధానంపై ప్రయాణికుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్షన్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సతీష్, మిర్యాలగూడ కమర్షియల్ సూపర్వైజర్ గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 31 , 2025 | 12:43 AM