చెర్వుగట్టుపై వైభవంగా దోపోత్సవం
ABN, Publish Date - Feb 08 , 2025 | 11:48 PM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడలరామలింగేశ్వరస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున దోపోత్సవం నిర్వహించారు.
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడలరామలింగేశ్వరస్వామి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున దోపోత్సవం నిర్వహించారు. అశ్వవాహనంపై పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రతిష్టింపజేసి ఆలయ వీధుల గుండా కల్యాణమంటపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. పురాణసాంప్రదాయా లను ఆచరిస్తూ దోపోత్సవాన్ని నిర్వహించారు. దోపోత్సవ వృత్తాంతాన్ని ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ భక్తులకు వివరించారు. అనంతరం ఉదయం అష్టోత్తర శత కలశాలతో స్వామివారికి అర్చకులు శ్రీకాంతశర్మ, సతీశశర్మ, సురేశశర్మ, నాగఫణిశర్మలతో అభిషేకం సూర్యనమస్కారాలు, దీక్షా హోమాలు, బలిహరణ అనంతరం ఈవో నవీనకుమార్ చేతుల మీదుగా మహాపూర్హాహుతి నిర్వహించారు. అనంతరం ధ్వజాన్ని అవరోహణ చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య త్రిశూలస్నానం, వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ కైంకర్యాల్ల్లోని పూజా క్రతువుల్లో పాల్గొన్న యాజ్ఞీకులు, అర్చకులకు దేవస్థానం ఆధ్వర్యంలో పండిత సన్మానం జరిగింది. రాత్రి పుష్పోత్సవం, ఏకాంత సేవలను నిర్వహించారు. వేడుకలో ఈవో నవీనకుమార్, పర్యవేక్షకుడు తిరుపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, నర్సిరెడ్డి, లింగయ్య, రాజయ్య, వెంకటయ్య, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
Updated Date - Feb 08 , 2025 | 11:48 PM