ఇంటర్ పరీక్షల్లో మొదటిరోజే 525 మంది గైర్హాజరు
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:13 AM
ఇంటర్మీడియట్ పరీక్షలకు తొలిరోజు 525 మంది గైర్హాజరయ్యారు. బుధవారం నిర్వహించిన ఫస్టియర్ పరీక్షకు జిల్లాలోని 32 పరీక్షా కేంద్రాల్లో 8,779 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 8,254 మంది హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి భానునాయక్ తెలిపారు.
భానుపురి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ పరీక్షలకు తొలిరోజు 525 మంది గైర్హాజరయ్యారు. బుధవారం నిర్వహించిన ఫస్టియర్ పరీక్షకు జిల్లాలోని 32 పరీక్షా కేంద్రాల్లో 8,779 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 8,254 మంది హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా అధికారి భానునాయక్ తెలిపారు. 525 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 6,910 మందికి 307 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,344 మందికి 218 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇదిలాఉండగా విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్‌తో పాటు అదనపు కలెక్టర్ రాంబాబు పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ జీ శ్రీనివాస్ బృందం కోదాడ, మఠంపల్లి ప్రాంతాల్లోని కేంద్రాలను, తుంగతుర్తి వైపు జీడీఎస్ ప్రసాద్ బృందం, సూర్యాపేటలో డీఐఈవో బృందం పరీక్షల నిర్వహణను పరిశీలించారు. డీఈసీ సభ్యులు కృష్ణయ్య నెమ్మికల్ సెంటర్‌ను తనిఖీచేశారు. ఏ సెంటర్‌లోనూ విద్యార్థులు ఆలస్యంగా రాలేదని, మాస్‌కాపీయింగ్ జరగలేదని డీఐఈవో తెలిపారు.
నెమ్మికల్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఆత్మకూరు(ఎస్), మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన వసతులను పరిశీలించారు. కళాశాల ఆవరణలో వృథాగా ఉన్న బెంచీలను స్టోర్‌రూమ్‌లో భద్రపర్చాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఫ్లయింగ్ స్క్వాడ్ వీడీప్రసాద్, తహసీల్దార్ హరిచంద్రప్రసాద్, డీఈసీ అధికారులు .కృష్ణయ్య, లక్ష్మయ్య, ఆర్‌ఐ ప్రదీ్‌పరెడ్డి ఉన్నారు.
సూర్యాపేటలో అదనపు కలెక్టర్...
భానుపురి, మార్చి 5 (ఆంధజ్యోతి):జిల్లాకేంద్రంలోని ఇంటర్ పరీక్షా కేం ద్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు తనిఖీచేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రతిభ, నారాయణ, గురుకుల జూనియర్ కళాశాల్లోని పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 12:13 AM