నేడే ఎమ్మెల్సీ ఎన్నికలు
ABN, Publish Date - Feb 27 , 2025 | 01:40 AM
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలన్నీ పట్టణాలు, మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. పోలింగ్ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలన్నీ పట్టణాలు, మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు.
పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి బుధవారం పోలింగ్ అధికారులు, సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రితో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. డిస్ర్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని, పోలింగ్ ఆరంభమయ్యే అర గంట ముందు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఏదేని గుర్తింపు కార్డులతో వచ్చిన ఓటర్లను మాత్రమే ఓటింగ్‌కు అనుమతిం చాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు తక్కువ మంది ఉన్న చోట ఒకే రూములో రెండు కంపార్ట్‌మెంట్లు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. పట్టణాల్లో రెండు వేర్వేరుగా బూత్‌లను ఏర్పాటు చేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెండు ఓట్లు కలిగిన వారికి పట్టభద్రులకు ఓటు వేసినప్పుడు చూపుడు వేలిపై, ఆ తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఓటు వేసినప్పుడు మధ్య వేలికి సిరా చుక్క పెట్టనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం బ్యాలెట్ బాక్కులను పెద్దపల్లికి అక్కడి నుంచి కరీంనగర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించనున్నారు. మార్చి 3వ తేదీన కౌంటింగ్ చేపట్టనున్నారు.
జిల్లా ఓటర్లు...
పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రులు 31,037 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 19,008 మంది, మహిళలు 12,028 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 13,974 మంది, మంథని నియోజకవర్గంలో 5,020 మంది, రామగుండం నియోజకవర్గంలో 9,973 మంది, ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని ధర్మారం మండలంలో 2,070 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఉపాధ్యాయ ఓటర్లు 1,111 ఉండగా, పురుషులు 647 మంది, మహిళలు 464 మంది ఉన్నారు.
ఫ పోలింగ్‌పై ఎవరి ధీమా వారిదే..
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌పై అభ్యర్థులు తమకే ఎక్కువ మంది ఓటర్ల మద్దతు ఉంటుందనే ధీమాలో ఎవరికి వారు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ల మధ్య పోటీ నెలకొన్నది. ఆ తర్వాత ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి శేఖర్ రావు, మహ్మద్ ముస్త్యాక్ అలీ, డాక్టర్ బండారి రాజ్‌కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలక పోవచ్చని, రెండవ ప్రాధాన్యత ఓట్లతో తేలే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఏజెంట్లను నియమిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా వంగ మహేందర్ రెడ్డి, మల్క కొమురయ్య, రఘోత్తమ్ రెడ్డి, అశోక్ కుమార్‌లు ముమ్మరంగా ప్రచారం చేశారు. వీరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉనట్లు కనబడింది. ఓటర్లు ఎవరిని శాసన మండలికి పంపిస్తారో వేచి చూడాలి.
Updated Date - Feb 27 , 2025 | 01:40 AM