ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దైవచింతనతో మానసిక ప్రశాంతత

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:26 PM

దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుం దని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

పూజలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : దైవ చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుం దని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని యంగంపల్లి గ్రామంలో సీతారామాంజనేయస్వామి, నవగ్రహ కీర్తి, లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఈ కార్య క్రమానికి ఎమ్మెల్యే, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడు ఠాకూర్‌ బాలాజీసింగ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌లు ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ అత్యంత కన్నుల పండుగగా కొనసాగింది.

పీఆర్‌ఎల్‌ఐ ద్వారా సాగునీరు

కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి, జిల్లెల, మార్చాల గ్రామాలకు పీఆర్‌ఎల్‌ఐ ద్వారా సాగు నీరందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎ మ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. వ్యవసాయా నికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నా రు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వరమ్మ, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే గుర్క పూజలు

యంగంపల్లి గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠకు మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ చింతన అలవర్చుకోవాలని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు విజయ్‌గౌడ్‌, మా జీ వైస్‌ ఎంపీపీ కొండూరు గోవర్ధన్‌, ఎముక జంగయ్య, పాండుగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:26 PM