ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంచాలి

ABN, Publish Date - Jan 10 , 2025 | 12:48 AM

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సంబందిత అధికారులను ఆదేశిం చారు.

మాట్లాడుతున్న డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రమోద్‌ కుమార్‌

- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌

జగిత్యాల, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ సంబందిత అధికారులను ఆదేశిం చారు. గురువారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌లతో ఈ-ఔషది కార్యక్రమంపై శిక్షణ, అవగాహన సద స్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మం దులు సరఫరా చేసేందుకు కనీసం మూడు నెలల ముందుగా సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్‌కు ఇండెంట్‌ పంపాలని సూచించారు. పీహెచ్‌సీల్లో సుమారు వంద రకాల మందులు ఉండేలా చూడాలని ఆదే శించారు. రోగులకు ఇచ్చే ప్రతీ ఒక్క మందు ఈ - ఔషద్‌లో నమోదు చేయాలన్నారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిపించుకునే గర్భిణులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో వంద శాతం లక్ష్యం సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ ఏ శ్రీనివాస్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుమన్‌, ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ కృష్ణ, పలువురు వైద్యాధికారులు, ఫార్మసిస్టులు, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:48 AM