ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:02 AM

మహిళలు భయం వీడి అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- దేశంలోనే తొలి మహిళా పెట్రోల్‌ బంక్‌ ప్రారంభం మరిచిపోలేనిది

- రెండు సోలార్‌ పవర్‌ ప్లాంట్స్‌, ఆర్టీసీ అద్దె బస్సు ఇచ్చేందుకు మహిళా సంఘాలకు అప్పగింత

- మహిళల సంక్షేమమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయం

- పేట నియోజకర్గ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు భయం వీడి అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

రాజకీయాల్లో మహిళా ప్రాధాన్యం?

మహిళలకు ఇళ్లల్లో, బయట కూడా ప్రాధాన్యం ఉంటుంది. మహిళలు ఇంటిని చక్కదిద్దుకుంటూనే రాజకీ యాలు చూసుకుంటున్నారు. ప్రతీ మహిళ అన్నివిధాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి. దాంతో సత్ఫలితాలు సాధించడం సులభమవుతుంది.

సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా?

ఇప్పటివరకు పార్టీ పరంగా కాని, ఎమ్మెల్యే పరంగా ఎలాంటి సమస్యలు లేవు. అంతా సాఫీగా కొన సాగు తోంది. ప్రజాసేవే పరమావధిగా, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

మహిళల సంక్షేమం కోసం చేస్తున్న కృషి ఏంటి?

నారాయణపేట నియోజకవర్గానికి మహిళా శాసన సభ్యురాలిగా కొనసాగేందుకు ప్రజలు ఆశీర్వదించి గెలిపిం చారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ముఖ్యంగా దేశం లోని మొదటి పెట్రోల్‌బంక్‌ జిల్లా మహిళా సమాఖ్య ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఫిబ్రవరి 21న ప్రా రంభించుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. మహిళా సంక్షే మమే లక్ష్యంగా రెండు సోలార్‌ పవర్‌ వన్‌మెగా వాల్ట్‌ విద్యుత్‌ ఉత్పత్తి పవర్‌ ప్లాంట్లు నియోజకవర్గంలో మహిళా సంఘాలకే అప్పగిస్తున్నాం.

రాజకీయాల్లోకి కొత్తగా రావాలనుకున్న మహిళలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు?

మహిళలు ముందుగా భయం వీడి రాజకీయాల్లోకి రావాలి. తాను చిన్న వయస్సులోనే రాజకీయంలో వచ్చేముందు కాస్త భయం వేసింది. వచ్చిన తర్వాత పోయింది. రాబోయే రోజుల్లో మహిళలకు రాజకీయాల్లో మూడింతలు ప్రాధాన్యత పెరుగు తుంది. మహిళలు ధైర్యంతో రాజకీ యాల్లోకి రావాలి.

Updated Date - Mar 08 , 2025 | 12:02 AM