కాంగ్రెస్‌తోనే సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:44 PM
ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆమోదం కోసం నిర్వ హిస్తున్న వార్డు, గ్రామసభలు రెండో రోజు బుధవారం పలు మండలాల్లో కొనసాగాయి.
- రెండోరోజు కొనసాగిన వార్డు, గ్రామ సభలు
- రుణమాఫీ కోసం అధికారులను నిలదీసిన పెద్దపొర్ల గ్రామస్థులు
- సంక్షేమ పథకాలు రాలేదని పలుచోట్ల అధికారులతో వాగ్వాదం
నారాయణపేట/కోస్గి రూరల్/ ఊట్కూర్/మాగనూరు/ధన్వాడ/మద్దూర్/కృష్ణ/నర్వ/దామరగిద్ద, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా సంక్షేమ పథకాలను అర్హులకు అందించాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆమోదం కోసం నిర్వ హిస్తున్న వార్డు, గ్రామసభలు రెండో రోజు బుధవారం పలు మండలాల్లో కొనసాగాయి. నారా యణపేట 14 వార్డులో కౌన్సిలర్ విశాలక్ష్మీ అఽధ్య క్షతన వార్డు సభ జరిగింది. సభలో మాజీ మా ర్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. పదేళ్ల క్రితం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు అందించిం దని, మళ్లీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వమే కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తోందని ఆయన అన్నారు. వార్డు సభలో ప్రభుత్వ పథ కాల జాబితాను అధికారులు చదివి వినిపించారు. పేర్లు లేని వారు కొత్తగా దరఖాస్తులు చే సుకోవాలని ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో శివన్న సైన్యం సభ్యులు కురువ మనోజ్, మసి పవన్, గడ్డం వినోద్, అస్నొద్దీన్, ఇందిర మ్మ కమిటీ సభ్యులు బండి ఆనంద్, మహ్మద్ ఖురేషి తదితరులున్నారు.
అదేవిధంగా, కోస్గి మునిసిపాలిటీలోని 2, 9వ వార్డు, మండల పరిధిలోని ముంగిమళ్ల, చెన్నా రం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్ పాల్గొని, మాట్లాడారు. పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు జాబితాను చదివి వినిపించారు.
ఊట్కూర్ మండలం పెద్దపొర్లలో జరిగిన గ్రామ సభలో రూ.రెండు లక్షలకు పైన ఉన్న రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందని టీం లీడర్ ఒకరు ఏవో గణేష్‌రెడ్డిని ప్రశ్నించారు. అలాగే ఆ త్మీయ భరోసా కూడా పనిచేయని వారికి, భూమి ఉన్నవారికి వచ్చింది.. అర్హులకు ఎందుకు రాలేదని కొందరు వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లి గ్రామంలో 60 మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తే కేవలం పది మందికి మాత్రమే రావడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆ గ్రా మస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయాచోట్ల పోలీసుల సహకారంతో అధికారులు గ్రామ సభను ముగించారు.
మాగనూరు మండలం ఉజ్జల్లి గ్రామంల్లో ఇందిరమ్మ ఇళ్లు, మాగనూరు గ్రామసభలో ఆత్మీయ భరోసా కార్యక్రమాలపై అధికారులతో ప్రజ లు వాగ్వాదానికి దిగారు. ఉజ్జల్లి గ్రామంలో ఇం దిరమ్మ ఇళ్ల కోసం 488 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 273 మందికి రావడం ఎంతవర కు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. మాగనూరులో ఆత్మీయ భరోసా కార్యక్రమంలో 14 మందిని ఎంపిక చేయగా అందులో ఇద్దరు మాత్రమే పథకానికి అర్హులని అధికారులు తేల్చ డంపై ప్రజలు మండిపడ్డారు. ఓబులాపూర్ గ్రా మంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో ట్రై నింగ్ కలెక్టర్, మాగనూరు తహసీల్దార్ గరీమా నరుల పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో ఇళ్ల జాబితా అయోమయంగా తయారైంది. గ్రామసభల్లో అధికారు లు లబ్ధిదారుల పేర్లను చదివి పంచాయతీ గోడ పై జాబితాను అంటించారు. జాబితాలో పేర్లు లేని వారు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు లేనివారు కార్యదర్శులతో వాగ్వాదానికి దిగుతుండగా తమకు సంబంధం లేదని, తహసీల్‌కు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. దీంతో వారు తహసీల్‌కు చేరుకొని తహసీల్దార్ శ్రీనివాస్‌తో గొడవకు దిగారు. కార్యాలయం బయట ధర్నాకు కూర్చుంటాం అంటూ హెచ్చరించడంతో ఆయన రేషన్‌కార్డుల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించారు.
మద్దూర్ మండలంలోని రెనివట్ల, దంగాన్‌పూర్, లక్కాయపల్లి, ఖాజీపూర్, భీంపూర్, సాపన్‌చెరువు తండా, పెదిరిపాడ్. పల్లెగడ్డ తది తర గ్రామాల్లోనూ అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు అధికారులను ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్లకు 252, రేషన్‌కార్డుల కోసం 504, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 66, రైతు భరోసాకు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంపీడీవో నర్సింహారెడ్డి తెలిపారు.
కృష్ణ మండల పరిధిలోని తంగడిగి, కున్సీ, ఐ నాపూర్ తదితర గ్రామ పంచాయతీ కార్యాల యాల్లో బుధవారం నిర్వహించిన గ్రామసభల్లో లబ్ధిదారుల పేర్లు చదువుతుండగా గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని చోటా మోటా నాయకుల మాటలు విని భూమి లే ని, ఇళ్లు లేని వారిని గాలికి వదిలివేయడం వల్ల తమ బతుకులు మారేదెన్నడని అఽధికారుల ముందు వాపోయారు.
నర్వ మండలంలోని రాయికోడ్, కల్వాల, యాంకి, కొత్తపల్లె గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు బుధవారం రెండో రోజు సాఫీగా కొనసా గాయి. తహసీల్దార్ మల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, డీటీ శ్రీనివాసులు, ఎంపీవో రాఘవేందర్, ఏవో అఖిలారెడ్డి తదితరులు ఆయా గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను చదివి వినిపించారు. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దామరగిద్దలో మండలంలో నిర్వహించిన గ్రామసభలో ఎంపీడీవో సాయిలక్ష్మి, తహసీల్దార్ దయాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో జ్యోతి, ఎంపీవో ఉదయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 22 , 2025 | 11:44 PM