అర్హులందరికి సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jan 22 , 2025 | 11:45 PM
రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ
- మక్తల్, నర్వ మండలాల్లో మంత్రి పర్యటన
- అభివృద్ధి పనులకు భూమిపూజ
మక్తల్/మక్తల్ రూరల్/నర్వ, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ప్ర భుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, 150 పడకల ఆసుపత్రికి భూమిపూజ, అనంతరం కాచ్‌వార్‌లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్ర భుత్వంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నా మన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్క రికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. మక్త ల్ నియోజకవర్గ కేంద్రంలో 150 పడకల ఆసు పత్రిని ఏడాదిలో నిర్మించి అందుబాటులోకి తె స్తామన్నారు. ఆసుపత్రితో పాటు ఇక్కడే నర్సిం గ్ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపా రు. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన అనంతరం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆత్మీయంగా పలకరించారు. అంతకుముందు ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ యోగేష్‌గౌతమ్, అదనపు కలెక్టర్ బెన్ షాలంలు మంత్రికి పుష్పగుచ్చం అందించి స్వా గతం పలికారు. పడమటి ఆంజనేయస్వామి ఆ లయంలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అంతకుముందు ఆయన నర్వ పీ హెచ్‌సీని తనిఖీ చేశారు. ఆసుపత్రి వెనుకభా గంలోని పరిసరాలను పరిశీలించారు. చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని జిల్లా వైద్యా ధికారి సౌభాగ్యలక్ష్మిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని పడకలను, రక్త పరీక్షల ల్యాబ్‌ను పరిశీలించారు. ల్యాబ్‌లో ఎన్నిరకాల రక్త పరీ క్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Jan 22 , 2025 | 11:45 PM