‘హామీలు అమలు చేస్తున్నాం’..
ABN, Publish Date - Jan 20 , 2025 | 11:33 PM
కు దేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చే స్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి అన్నారు.
కొత్తకోట, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కు దేలైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చే స్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూద న్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సం దర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 26 నుంచి అమలు కాను న్న సంక్షేమ పథకాలు, రేషన్‌కార్డులు, ఇంది రమ్మ ఇళ్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. జాబితాలో పేరు లేదని బాధపడాల్సిన అ వసరం లేదన్నారు. గ్రామసభలో దరఖాస్తు చే సుకుంటే అధికారులు విచారణ చేసి ఆ పథకా నికి ఎంపిక చేస్తారన్నారు. అనంతరం విలియం కొండకి వెళ్లి పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. ప్రశాంత్, గొల్లబాబు తహసీ ల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చెన్నమ్మ నాయ కులు బోయోజ్, కృష్ణారెడ్డి, బీచుపల్లి యాదవ్, శ్రీనువాసులు, బాబు, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jan 20 , 2025 | 11:33 PM