వైభవంగా వైకుంఠ ఏకాదశి పూజలు
ABN, Publish Date - Jan 10 , 2025 | 11:45 PM
వైకుంఠ ఏకాదశి సం దర్భంగా జిల్లాలోని ఆలయాలు శుక్ర వారం భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాల టౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ఏకాదశి సం దర్భంగా జిల్లాలోని ఆలయాలు శుక్ర వారం భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుని, ప్రత్యేక పూజలు చేశారు. గద్వాలలో ని శ్రీభూలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆల యంలో జిల్లా న్యాయాధికారి గంట కవితాదేవి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు, విచారణ కర్త దిన్నె ప్రభకార్‌రావు పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. అలాగే జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సతీమ ణి బండ్ల జ్యోతి, పలువురు ప్రజాప్ర తినిధులు, అధికారులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శిం చుకున్నారు. స్థానిక పీజేపీ కాలనీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకుని పూజలు నినర్వహించా రు. బురదపేటలోని శ్రీరంగనాథ స్వామి ఆలయం, పెద్ద అగ్రహారం లోని అహోబిళ మఠం శ్రీలక్ష్మీనర సింహస్వామి, గంజిపేటలోని వేంక టేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
అయిజ: ప్రతీవ్యక్తి దైవచిం తన కలిగి ఉండాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అయిజలో మద్దిలేటి లక్ష్మీనర్సింహస్వామి, కట్టకింద వేంకటేశ్వరస్వామి, ఉత్తనూర్ ధన్వం తరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు.
Updated Date - Jan 10 , 2025 | 11:45 PM