ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాలమూరులో ఊర్వశి రౌతేలా సందడి

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:29 PM

మహబూబ్‌నగర్‌ పట్టణంలో సినీ నటి ఊర్వశి రౌతేలా శనివారం సందడి చేశారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ 39వ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో ఊర్వశి రౌతేలా, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు.

ఫొటోకు ఫోజిచ్చిన ఊర్వశి రౌతేలా

సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ను ప్రారంభించిన సినీనటి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

పాలమూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ పట్టణంలో సినీ నటి ఊర్వశి రౌతేలా శనివారం సందడి చేశారు. పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌ 39వ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో ఊర్వశి రౌతేలా, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రిబ్బన్‌ కట్‌ చేయగా, ఊర్వశి రౌతేలా జ్యోతి ప్రజ్వలన చేశారు. సంస్థ డైరెక్టర్లు సురేశ్‌సీర్ణ, అభినయ్‌, రాకేశ్‌, కేశవ్‌ వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ తరహాలో పాలమూరు ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన వస్ర్తాలను అందించే షాపింగ్‌ మాల్‌ ఇక్కడ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పారు. నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ అంకిత భావానికి, ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. జిల్లా ప్రజలు కోరుకునే నాణ్యత, నవ్యత, అభిరుచికి తగ్గట్లుగా చీరలు, దుస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో అద్భుతంగా కనిపించేందుకు అత్యుత్తమ కలెక్షన్స్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు. పెళ్లి కుమార్తెల కోసం మగ్గాలపై నేసిన చీరలు ప్రత్యేకమని, పెళ్లి కుమారుల కోసం ఎత్నిక్‌వేర్‌ గురించి ఎంతచెప్పినా తక్కువేనని అన్నారు. అన్ని వర్గాల వారిని అలరించేలా, సరసమైన ధరలకు దుస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా కాస్ట్‌ టు కాస్ట్‌ అమ్మకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, షబ్బీర్‌ అహ్మద్‌, కౌన్సిలర్‌ రాంలక్ష్మణ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:29 PM