ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సేవాలాల్‌ చూపిన మార్గం ఆచరణీయం

ABN, Publish Date - Feb 21 , 2025 | 12:00 AM

సంత్‌ సేవాలాల్‌ మహ రాజ్‌ చూపిన సన్మార్గాలు ప్రతీ ఒక్కరికి ఆచరణీయ మని ఎక్సైజ్‌, పర్యాటక, సాం స్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృ ష్ణారావు అన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు , కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ లను సన్మానిస్తున్న గిరిజనులు

- హింస, మత్తుకు దూరంగా ఉండాలన్న వ్యక్తి..

- మంత్రి జూపల్లి కృష్ణారావు

- కొల్లాపూర్‌లో ఘనంగా సంత్‌ సేవాలాల్‌ జయంతి

కొల్లాపూర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : సంత్‌ సేవాలాల్‌ మహ రాజ్‌ చూపిన సన్మార్గాలు ప్రతీ ఒక్కరికి ఆచరణీయ మని ఎక్సైజ్‌, పర్యాటక, సాం స్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృ ష్ణారావు అన్నారు. సంత్‌ సేవాలాల్‌ జయం తి ఉత్సవాలను గురువారం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నాగ ర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని సేవాలాల్‌ భవన్‌లో ఘనంగా నిర్వ హించారు. ముందుగా పట్టణంలోని మాధవస్వామి గుడి నుంచి ఈదమ్మ రో డ్డు మార్గం గుండా గిరిజన భవనం సభ స్థలం వరకు బైక్‌ ర్యాలీతో గిరిజన సాంప్రదాయ నృత్యాలతో యువతీ, యువకులతో కలిసి కలెక్టర్‌ బదావత్‌ సం తోష్‌ పాల్గొన్నారు. సేవాలాల్‌ మహారాజ్‌ మేరమ యాడి దేవతకు మహాభోగ్‌ (హోమం)లో పాల్గొన్న మంత్రి, కలెక్టర్‌, లంబాడి జూరారులతో కలిసి సాం ప్రదాయబద్ధంగా హోమంలో నెయ్యి కడావ్‌ ప్రసాదం వేసి నైవేద్యం సమ ర్పించారు. జిల్లాలోని ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్థిలేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు. అనంతరం జడ్పీటీసీ మాజీ సభ్యుడు హను మంత్‌ నాయక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. సే వాలాల్‌ అందరికీ ఆదర్శ ప్రాయుడని, జీవహింస చేయరాదని, అబద్దాలు మాట్లాడరాదని, చోరీలు చేయొద్దని, మాంసాహారం తినొద్దని బోధించారని గుర్తు చేశారు. సేవాలాల్‌ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ని ర్వహిస్తుందని తెలిపారు. తన నియోజకవర్గంలో సేవాలాల్‌ ఆలయాన్ని ని ర్మించేందుకు, ఇప్పుడున్న సేవాలాల్‌ భవన్‌ అన్ని వసతులతో పూర్తి చేసేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ తండాలో గిరిజనులుసారాను త యారు చేయవద్దని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే సారాను దూరం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫిరంగి, ఆర్డీవో భన్సీలాల్‌, బస్తీరామ్‌ నాయక్‌, శంకర్‌ నాయక్‌, గోవింద్‌ నాయ క్‌, గోపి నాయక్‌, లంబాడి గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రకృతిని కాపాడాల్సిన జాతి మనదే : కలెక్టర్‌

సంత్‌ సేవాలాల్‌ తన బోధనల ద్వారా గిరిజన జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకింతం చేశారన్నారు. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి అని తెలిపారు. ప్రతీ ఒక్కరు జాతి అభ్యున్నతికి కృషి చేయాలని, విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ కాపాడాల్సిన బాధ్యత మన జాతి మీదే ఉందని కలెక్టర్‌ గుర్తు చేశారు.

Updated Date - Feb 21 , 2025 | 12:00 AM