ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పునరావాసం ఫైలు పరిశీలనలో ఉంది

ABN, Publish Date - Feb 16 , 2025 | 11:13 PM

పాలమూరు ఎత్తిపోతల ప థకం, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న వ ల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన పున రావాసం పెంపునకు సంబంధించిన ఫైలు పరిశీలనలో ఉందని జ డ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తెలిపారు.

-త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ

- జలమండలి కార్యాలయంలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

- వివరాలు వెల్లడించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు ఎత్తిపోతల ప థకం, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న వ ల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాల నిర్వాసితులకు సంబంధించిన పున రావాసం పెంపునకు సంబంధించిన ఫైలు పరిశీలనలో ఉందని జ డ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే పెంపు పై నిర్ణయం తీసుకోనున్నట్లు ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లోని జలమండలి కా ర్యాలయంలో ఆదివారం ఇరిగేషన్‌శాఖ అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారన్నారు. సమీక్షలో పాల్గొని ఉదండాపూర్‌ నిర్వాసితుల సమస్యలను మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఎమ్మెల్యే వెల్లడించారు. పునరావాసం పెంపు అంశంలో నిర్వాసితు లకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటానని, అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేనే అయిన తాను అవసరమైతే ఎవరితోనైనా పోరాడుతానని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు నేడు తాను శిక్షను అనుభవిస్తు న్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితుల సమస్యలు, పునరావాస పరిహారం పెంచాలంటూ ఎమ్మెల్యే కాకముందే పోరా టం చేశానని, ఎమ్మెల్యే అయిన అనంతరం మొదటి అసెంబ్లీ సమా వేశంలో సభ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు. పాలమూరు ఎత్తి పోతల ప్రాజెక్ట్‌కు ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ గుండెలాంటిదన్నారు. కుడి, ఎడమ కాలువతో నీళ్లు అందిస్తే 8లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. గత ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టు సామర్థ్యంను ఒక టీఎంసీ పెంచి, ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30వేల కోట్లకు పెంచిం దని, అదే సమయంలో ఉదండాపూర్‌ నిర్వాసితుల సమస్యను ప ట్టించుకుని ఉంటే ఎప్పుడో పరిష్కారమయ్యేదని పేర్కొన్నా రు. పరిహారం పంపిణీ అంశంలో జరిగిన తప్పులను సరిదిద్దేందుకే రీ సర్వే చేస్తున్నారని, సర్వే పూర్తయి అవార్డు పాసైతేనే పరిహారం విషయంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని, నిర్వాసితులు గుర్తించాలని కోరారు. ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు రాబోయే రోజులన్నీ మంచి రోజులేనంటూ పేర్కొన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:13 PM