సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం
ABN, Publish Date - Jan 19 , 2025 | 11:37 PM
విద్యార్థులకు విద్యకుతోడుగా సాంకేతిక పరిజ్ఞా నం చాలా అవసరమని తాజ్ డెక్కన్ ఎడ్యు కేషన్ అండ్ కల్చర్ సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్య క్షుడు సలీం నవాబ్ అన్నారు.
ఊట్కూర్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు విద్యకుతోడుగా సాంకేతిక పరిజ్ఞా నం చాలా అవసరమని తాజ్ డెక్కన్ ఎడ్యు కేషన్ అండ్ కల్చర్ సొసైటీ ఉమ్మడి జిల్లా అధ్య క్షుడు సలీం నవాబ్ అన్నారు. ఆదివారం సా యంత్రం మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 27 మంది విద్యార్థులకు ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ.. పిల్లల భవిష్యత్‌పై తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభు త్వం ఉచితంగా గురుకులాలు, హాస్టల్స్ ఏర్పా టు చేసిందని చెప్పారు. అందులో చేర్పించి ఉ న్నత విద్యను అందించాలన్నారు. పిల్లలకు ఆ స్తులు ఇవ్వకపోయినా పర్వాలేదని, మంచి విద్య ను మాత్రం తప్పక అందించాలని కోరారు. మూడు నెలల పాటు పూర్తి కంప్యూటర్ శిక్షణ ను ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌస్, అబ్దుల్ రహెమాన్, కాజీం హుస్సేన్, మన్సూర్ అహ్మద్, మునీర్ అహ్మద్, మొహ్మద్ నాజీమ్ అహ్మద్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 19 , 2025 | 11:37 PM