ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - Jan 23 , 2025 | 12:01 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు.
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
- ఆత్మకూరులో రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ప్రారంభం
- 50 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం స్థల పరిశీలన
ఆత్మకూరు/అమరచింత, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో ఆయన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూ దన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డిలతో కలిసి ఆయన పర్యటించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కోరిక మేరకు ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.50 కోట్లతో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం రూ.22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం పీజేపీ క్యాంపు ఆవ రణలో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇది వరకు ఉన్న భవనంలో పీహెచ్‌సీ నిర్వహించి పీజేపీ క్యాంపు ఆవరణలో నూతన భవనా న్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలి పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి జబ్బులకైనా ప్రభుత్వ ఆస్పత్రులలోనే మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అనంతరం సాయంత్రం అమరచింత డీఎంఆర్ ఆస్ప త్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఎక్స్‌రే ల్యాబ్, ప్ర సూతి గదిని, రికార్డులను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆసుపత్రిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలో ప్రజల కు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. అమరచింతకు చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి సొంత వ్యయంతో ఇంత మంచి ఆస్పత్రిని కట్టించి ప్రభుత్వానికి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈఆసుపత్రిని తక్షణమే పీహెచ్ సీగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అనం తరం టీబీ వ్యాధిగ్రస్థులకు న్యూట్రిషన్ కిట్లను అందజే శారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్ సురభి, ఎస్పీ రావు ల గిరిధర్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, తెలంగాణ కల్లుగీ త కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజుగౌడ్, ము నిసిపల్ చైర్‌పర్సన్ మంగమ్మ, మునిసిపల్ కమిషనర్ నూరుల్ నజీర్, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 23 , 2025 | 12:01 AM