కరాటేతో బాలికలకు ఆత్మరక్షణ
ABN, Publish Date - Mar 10 , 2025 | 11:45 PM
పాఠశాలల్లో కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మ రక్షణ, క్రమశిక్షణ పెంపొందుతాయని లీగల్ సెల్ న్యాయమూర్తి రజిని తెలిపారు.
ఖిల్లాఘనపురం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : పాఠశాలల్లో కరాటే శిక్షణతో బాలికలకు ఆత్మ రక్షణ, క్రమశిక్షణ పెంపొందుతాయని లీగల్ సెల్ న్యాయమూర్తి రజిని తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠ శాల, కేజీబీవీ ఇంగ్లిష్, తెలుగు మీడియం పా ఠశాలల్లో సోమవారం బాలికల కరాటే విన్యా సాల ప్రదర్శనను న్యాయమూర్తి రజిని వీక్షిం చారు. ఈ సందర్భంగా న్యాయాధికారి రజిని మాట్లాడారు. చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగా హన అవసరమని అన్నారు. బడుగు బలహీన వర్గ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి బాలబాలి కలకు న్యాయస్థానాల్లో ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహ నాలు నడిపితే ప్రమాదం జరిగే అవకాశం ఉం దని, డ్రంకెన్ డ్రైవ్‌లో జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. కేజీబీవీ తెలుగు మీడియం పా ఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో లీగల్ సెల్ బార్ కౌన్సిల్ సభ్యుడు కృష్ణయ్య, ఎంఈవో జయశం కర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునవార్ సుల్తానా, లలిత, ప్రశాంతి, ఉపాధ్యాయులు త దితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 10 , 2025 | 11:45 PM