ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలి

ABN, Publish Date - Mar 10 , 2025 | 11:43 PM

రైతుల ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయ పరి శోధనలు ఉపయోగపడాల ని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకు ళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రాజేశ్‌ రెడ్డి

- ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి

- కిసాన్‌మేళాను, వ్యవసాయ ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే

- అధిక సాంద్రతలో పత్తిసాగుపై అవగాహన

బిజినేపల్లి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయ పరి శోధనలు ఉపయోగపడాల ని ఎమ్మెల్యే డాక్టర్‌ కూచకు ళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినే పల్లి మండలంలోని పాలెం లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ దక్షిణ తెలంగాణ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సోమవారం కిసాన్‌ మేళా, వ్యవసాయ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రాం తీయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు డాక్టర్‌ సీ సుధాకర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. వారి ఆర్థికాభివృద్ధి కోసం తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించాలని కోరారు. డాక్టర్‌ సీ సుధాకర్‌ మాట్లాడుతూ అధిక సాంద్రతలో పత్తి సాగు చేపడితే పంట దిగుబడి పెరిగి రైతులు లాభపడుతారని అన్నారు. పత్తి సాగులో మొక్కకు మొక్కకు మధ్య మీటరు దూరానికి బదులు సాళ్ల పద్దతిలో విత్తుకుంటే ఎకరాకు 12 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని వివరించారు. రాబోయే రోజుల్లో పత్తి సాగులో కూలీల కొరతను అధిగమించేందుకు యంత్ర పరిజ్ఞానంపై పరిశోధనలు సాగుతున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే రాజేశ్‌ రెడ్డి యంత్ర సాంకేతిక పరిజ్ఞానం స్టాల్స్‌ను, నమూనాలను పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణరావు, కేవీకే కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జగన్‌, దాసరి నారాయణ, ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ భరత్‌ భూషణ్‌, ఏవో నీతిరెడ్డి, కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్‌, రామకృష్ణ, శైల, ఆదిశంకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 11:43 PM