పీఎం విశ్వకర్మ యోజనను వినియోగించుకోవాలి
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:30 PM
సాంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్ధికంగా మ రింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం వి శ్వకర్మ యోజనను ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): సాంప్రదాయ చేతివృత్తుల వారు ఆర్ధికంగా మ రింత స్థిరపడేందుకు రూపొందించిన పీఎం వి శ్వకర్మ యోజనను ప్రజలు సద్వినియోగం చే సుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో పీఎం విశ్వకర్మ పదకంపై ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్ట ర్ మాట్లాడుతూ.. అంతరించిపోతున్న చేతి, కులవృత్తుల వారికి చేదోడుగా ఉండాలనే ఉద్దేశం తో కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారిలో సామర్ధ్యాన్ని పెంచి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉత్పాదకత, నాణ్యత, ఉత్పత్తులను మెరుగుపరిచి, ఆర్థికంగా చేయూతనిస్తూ జీవనోపాధిని అభివృద్ధి చేయడమే ఈ పథకం లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉ ప్పరి, ఎరుకల, దర్జీ తదితర 18 కుల వృత్తుల వారికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు శిక్షణతో పాటు రుణాలను అందజేయడం జరుగుతుందన్నారు. 18సంవత్సరాలు పైబడిన కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులని, ఎలాంటి విద్యార్హత లేకున్నా పేరు నమోదు చేసుకోవచ్చని, కుటుం బంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదన్నారు. విశ్వకర్మగా పేరు నమోదు కోసం సమీపంలోని కా మన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్‌నెంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్ర్కీనింగ్ చేసి జిల్లాస్థాయి అమలు కమిటీకి పంపుతుందన్నా రు. ఎంపికైనా వారికి రెండు రకాలుగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ప్రాథమిక నైపుణ్యం ద్వారా 5 నుంచి 7 రోజులు, అధునాతన నైపుణ్యానికి 15రోజులు శిక్షణ అందిస్తూ శిక్షణ కా లంలో ప్రతీరోజు రూ.500భృతి ఇవ్వడంతో పా టు శిక్షణ అనంతరం రూ.15వేల విలువైన టూ ల్ కిట్లు, ధ్రువీకరణపత్రం ఇస్తారని తెలిపారు. రెండు విడతలుగా మొత్తం రూ.3లక్షల బ్యాంకు రుణం అందించనున్నట్లు తెలిపారు. ఈ రుణానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే త మ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగేశ్వర్‌గౌడు, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏడి శివరామ్‌ప్రసాద్, ఢీల్లీ ప్రతినిధి సంజీవ్‌కుమార్ సైని, ఇన్‌చార్జి డీపీవో నాగేంద్రం, ఎల్‌డీఎం ఆయ్యపురెడ్డి, జిల్లా అధికారులు ఉన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 11:30 PM