ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోరిన కోర్కెలు తీర్చే పాలెం వెంకన్న

ABN, Publish Date - Jan 28 , 2025 | 11:37 PM

తీరితే తిరుపతి, లేకుంటే పాలెం వెంకన్న స్వామిని దర్శించు కొని మొక్కు తీర్చుకోవచ్చని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం.

విద్యుత్‌ దీపాలతో పాలెం వేంకటేశ్వర స్వామి దేవాలయం

- రేపటి నుంచి ఆరవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు

- నాలుగవ తేదీన రథోత్సవం

- వేలాదిగా తరలిరానున్న భక్తులు

- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

బిజినేపల్లి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : తీరితే తిరుపతి, లేకుంటే పాలెం వెంకన్న స్వామిని దర్శించు కొని మొక్కు తీర్చుకోవచ్చని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం క్షేత్రం పేదల తిరుపతిగా విరాజిల్లుతోంది. ఇక్కడ అలువేలు మంగా సమేత వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. గురువా రం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చరిత్ర, విశిష్ఠతలు, ఉత్సవాల వివరాలతో ప్రత్యేక కథనం..

ఆలయ వ్యవస్థాపకుడు సుబ్బయ్య

పాలెం గ్రామానికి చెందిన తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ (పాలెం సుబ్యయ్య) చుట్టు పక్కల గ్రామాల్లోని పేదలందరికీ ఉచితంగా విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో కొనసాగించడం ప్రశ్నార్థకంగా మారిం ది. ఆదే సమయంలో అంటే, 1962లో గ్రామానికి చెందిన మనుసాని నీలకంఠయ్య కుమారులు రామ లింగయ్య, బాల్‌లింగయ్యల ఆర్థిక సహకారంతో ఆల యాన్ని నిర్మించి, తిరుమల తిరుపతి నుంచి వేంకటేశ్వ రస్వామి మూలవిరాట్‌ను తీసుకొచ్చి ప్రతిష్ఠించి నిత్య పూజలను ప్రారంభించారు. ఇక్కడి మూలవిరాట్‌ అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని స్వామి వారిని పోలి ఉంటుందని పురోహితులు చెప్తుంటారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల సహాయ సహ కారాలతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.

రూ. 1.5 కోట్లతో అభివృద్ధి పనులు

స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచే కాకుండా శ్రీశైలం, ఉమా మహేశ్వరం క్షేత్రాలకు వెళ్ళే కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు. ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ సేదతీరి, మరుసటి రోజు శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటారు. కాగా క్షేత్రంలో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, హెచ్‌ఈఓఎస్‌ కన్‌ స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ సహకారంతో అభి వృద్ధి పనులు చేపట్టారు. రూ.60 లక్షల వ్యయంతో వసతి గృహాల నిర్మాణం చేపట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డిలు ప్రభుత్వం నుంచి నిధులు మం జూరు చేయించారు. రూ.20 లక్షలతో కల్యాణ మండ పాన్ని ఆధునికీకరించారు. రూ.12 లక్షలతో ఆలయ ప్రాంగణంలో షెడ్‌ నిర్మించారు. మరో రూ.10 లక్షల వ్యయంతో ఆలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం, బోరు మోటర్‌, హైమాస్ట్‌ లైట్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టి ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు

ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో పాలెం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 30 నుంచి వచ్చేనెల ఆరవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వ హించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు 30వ తేదీన స్వామి వారికి అభిషేకం, కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, పాలెం పూర్వ విద్యార్థుల సేవా సమితి, చైతన్య కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి భాగవత పద్య పఠన పోటీలు నిర్వహించ నున్నారు. అనంతరం రక్షాబంధనం, హంసవాహన సేవ ఉంటాయి. 31న నిత్యారాధన, బలిహరణం, ధ్వజారోహణం, గరుడ పొంగళి నివేదన, సంతానం లేని వారికి ప్రసాద వితరణ కార్యక్రమాలుంటాయి. ఆ తర్వాత హనుమంత వాహన సేవ, నివేదన నిర్వహిస్తారు. వచ్చేనెల ఒకటిన ప్రబంధ పారాయ ణం, లక్ష పుష్పార్చన, రెండున డాక్టర్‌ పి.భాస్కర యోగి ధార్మిక ప్రవచనం, స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం గజ వాహన సేవ ఉంటుంది. మూడున వేంకటేశ్వర స్వామి భజన మండలి నేతృత్వంలో జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించనున్నారు. సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. నాలుగున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం, కుంభము, రథోత్సవం (తేరు) నిర్వహించనున్నారు. ఐదవ తేదీన పాలెం పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో మండల స్థాయి గోవింద నామాల పోటీ, ఉద్దాల మహోత్సవం నిర్వహించనున్నారు. ఆరున చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం పుష్పయాగం, శేషవాహన సేవ, పవళింపు సేవ, పండిత సన్మానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Updated Date - Jan 28 , 2025 | 11:37 PM