‘పది’ పరీక్షలకు 10 రోజులే
ABN, Publish Date - Mar 10 , 2025 | 11:48 PM
పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
- పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు
- ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా కృషి చేస్తున్న ఉపాధ్యాయులు
- ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు
- జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలు
- హాజరు కానున్న 7,717 మంది విద్యార్థులు
గద్వాల సర్కిల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు కేవలం పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించినున్న పరీక్షలకు విద్యార్థు లు పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా రాష్ట్ర స్థాయిలో జోగుళాంబ గద్వాల జిల్లా పేరును మొదటి పది స్థానాల్లో నిలబెట్టేందుకు జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా రు. వెనకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో డీఈవో అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేలా విద్యార్థులకు ప్రేరణ కల్పిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 184 పాఠశాలలు
ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 40 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 184 పాఠశాలల నుంచి 7,717 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గద్వాలనియోజకవర్గంలో 20, అలంపూర్ నియోజకవర్గంలో 20 పరీక్షా కేంద్రాలున్నాయి. వీటిలో గద్వాలలో 9, ధరూర్‌లో 4, గట్టులో 3, మల్దకల్‌లో 3, కేటీ దొడ్డిలో 1, అలంపూర్‌లో 2, అయిజలో 6, ఇటిక్యా లలో 4, ఉండవెల్లిలో 3, మానవపాడులో 1, రాజోలిలో 1, శాంతినగర్‌లో 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒత్తిడిని జయిస్తే ఉత్తమ ఫలితాలు
మరో 10రోజుల్లో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు హాజ రయ్యే విద్యార్థులు ఒత్తిడిని జయిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తమ మనసును ప్రశాతంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. సెల్ వాడకానికి, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నా రు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విష యంలో విసుక్కోవడం.. పనులు అప్పగించ డం లాంటివి చేయరాదని సూచి స్తున్నారు.
Updated Date - Mar 10 , 2025 | 11:48 PM