ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా జాతీయ సైన్స్‌ దినోత్సవం

ABN, Publish Date - Feb 28 , 2025 | 11:22 PM

నారాయణపేట విద్యాశాఖ కార్యాలయం వద్ద సీవీ రామన్‌ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పేట శిశుమందిర్‌లో సైన్స్‌ ప్రయోగాల గురించి వివరిస్తున్న విద్యార్థులు

నారాయణపేట/నారాయణపేట రూరల్‌/ మక్తల్‌/దామరగిద్ద/కృష్ణ/కోస్గి రూరల్‌/ ఊట్కూర్‌/మక్తల్‌ రూరల్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట విద్యాశాఖ కార్యాలయం వద్ద సీవీ రామన్‌ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాష్‌ మాట్లాడుతూ భారత శాస్త్రవేత్త వైద్యుడు సీవీ రామన్‌ కనుగొన్న రామన్‌ ఎఫెక్ట్‌ గౌరవార్థం ఫిబ్రవరి 28న భారతదేశ వ్యాప్తంగా జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని జరుపు కుంటున్నామన్నారు. ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్‌ ఎఫెక్ట్‌ అంటారని తెలిపారు. కార్యక్రమంలో సచ్చిదానందచారి, రాజేందర్‌, యాదయ్యశెట్టి, శ్రీనివాసులు, శశికుమార్‌, మహేష్‌, సురేష్‌, ఎంఈవో బాలాజీ, శ్రీకాంత్‌, రాహుల్‌, వెంకట్రాములు, నర్సింగ్‌, అబ్దుల్‌ఘని తదితరులున్నారు. అలాగే, సరస్వతీ శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం దత్తుచౌదరి ఆధ్వర్యంలో సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు సైన్స్‌ ప్రయోగాలు ఏర్పాటు చేసి వివరించారు. కార్యక్రమంలో మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అదేవిధంగా, పేట మండలం జాజాపూర్‌, కోటకొండ జడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీవీ రామన్‌ చిత్రపటానికి పలువురు నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన రంగోలి, సైన్స్‌ పరికరాల విశ్లేషణను వివరించారు. జిల్లా సైన్స్‌ అధికారి భానుప్రకాశ్‌, హెచ్‌ఎంలు భారతి, సునీత, ఉపాధ్యాయులు విజయ, మధుసూదన్‌, లక్ష్మణ్‌, ప్రతాప్‌, నరసింహా, శశిరేఖ, నిర్మల, మంగళ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మక్తల్‌లోని డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు తమ తమ ఆవిష్కరణల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ నారాయణగౌడ్‌, అధ్యాపకులు హరిశ్చంద్ర, రమేష్‌గౌడ్‌, నర్సోజీ, లింగప్ప, బాల్‌రాజ్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, జహంగీర్‌, మహేష్‌, సులోచన, రాజేశ్వరి, నాగేంద్రమ్మ, ప్రదీప్‌కుమార్‌లు పాల్గొన్నారు. అలాగే, పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎంఈవో అనిల్‌గౌడ్‌ హాజరై విద్యా ర్థుల ప్రదర్శనలు తిలకించి మాట్లాడారు.

దామరగిద్దలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సైన్స్‌ పటాలకు సంబంఽధిం చిన డ్రాయింగ్‌ పోటీలు, క్విజ్‌, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పోటీల్లో భాగంగా సైన్స్‌ పరి కరాలను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరి చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. హెచ్‌ఎం అశోక్‌, సైన్స్‌ ఉపాధ్యాయులు శంబులింగం, శ్రీనివాస్‌రెడ్డి, నిర్మల, అమృత్‌, సక్సేనా, తిప్పన్న, మల్లికార్జున్‌ పాల్గొన్నారు.

కృష్ణ మండలం ముడుమాల్‌ గ్రామ జడ్పీ హెచ్‌ఎస్‌లో నిర్వహించిన సైన్స్‌ దినోత్సవంలో ఎంఈవో నిజాముద్దీన్‌ మాట్లాడారు. అంతకు ముందు విద్యార్థులు చేపట్టిన వివిధ రకాల సైన్స్‌ ప్రదర్శన, ప్రయోగాలు, రాకెట్‌ తయారీ విధానాలను ఎంఈవో పరిశీలించారు. సైన్స్‌పై ఉ పాధ్యాయులు క్విజ్‌ నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. జీహెచ్‌ఎం జనార్దన్‌రెడ్డి, కుర్మయ్య, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.

కోస్గి మండలం ముశ్రీఫా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌, డ్రాయింగ్‌, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సైన్స్‌కు సంబంధించిన ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగం ప్రాముఖ్యతను హెచ్‌ఎం శేఖరయ్య విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు బాల కృష్ణ, శకుంతల, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఊట్కూర్‌ మండలం బిజ్వార్‌లో పాఠశాలలో సీవీ రామన్‌ అక్షరాల ఆకారంలో విద్యార్థులు కూర్చొని ఆయనకు నివాళి అర్పించారు. అలాగే ఊట్కూర్‌ బాలికల, బాలుర ఉన్నత పాఠశాల, కొల్లూర్‌, పెద్దజట్రం, చిన్నపొర్ల పులిమామిడి పా ఠశాలల్లో సైన్స్‌ దినోత్సవం నిర్వహించారు.

మక్తల్‌ మండలం రుద్రసముద్రం గ్రామ ఎం పీయూపీఎస్‌లో విద్యార్థులు సైన్స్‌డేను జరుపుకు న్నారు. హెచ్‌ఎం హేమలతఅన్పూర్‌ మాట్లాడారు. సీవీ రామన్‌ ఎఫెక్ట్‌ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కు మార్‌, ప్రహ్లాద్‌, ఎం.ఆంజనేయులు, ఎన్‌.మంజులత, టి.ప్రమీల, రామ్‌కిరణ్‌, వరుణ్‌కుమార్‌, దివ్యజ్యోతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 11:22 PM