చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN, Publish Date - Feb 01 , 2025 | 10:58 PM
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి, జూనియర్ సివిల్ న్యాయాధికారి వింద్యనాయక్, మహమ్మద్ ఉమర్‌లు అన్నారు.
- సీనియర్, జూనియర్ సివిల్ న్యాయాధికారులు వింద్యనాయక్, మహమ్మద్ ఉమర్
మక్తల్‌రూరల్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి, జూనియర్ సివిల్ న్యాయాధికారి వింద్యనాయక్, మహమ్మద్ ఉమర్‌లు అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో సంగంబండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలతో పాటు, మక్తల్ టౌన్ మార్కెట్ యార్డులో చట్టాల పై విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. సదస్సులో వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. సివిల్, క్రిమినల్, ట్రాఫిక్ చట్టం, బాలకార్మిక, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, పిల్లలకు న్యాయ సేవలను అందించడం తదితర చట్టాలపై వారు అవగాహన కల్పించారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ తిరుపతయ్య, నర్సిములు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కే.లక్ష్మిపతిగౌడ్, అడ్వకేట్స్ దత్తాత్రేయ, సూర్యప్రకాష్, సురేంద్ర, ఆనంద్, నీరజ్, నర్సిములు, ప్రిన్సిపాల్ కే.చంద్రకళ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Feb 01 , 2025 | 10:58 PM