ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలి

ABN, Publish Date - Feb 16 , 2025 | 11:10 PM

కేం ద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు తీసుకురాని ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు.

జాన్‌వెస్లీకి వినతిపత్రం అందజేస్తున్న కార్మిక సంఘాల నాయకులు

- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

పాలమూరు, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కేం ద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు తీసుకురాని ఎంపీలు, మంత్రులు రాజీనామా చేయాలని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆరుంధతి భవనం లో ‘కేంద్ర బడ్జెట్‌ వివిధ రంగాలపై ప్రభావం’ అ నే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి 8మంది ఎంపీ లను గెలిపిస్తే ప్రజలకు మొండి చేయి చూపిం దన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హో దా కల్పించకుండా అన్యాయం చేసిందన్నారు. కేం ద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26బడ్జెట్‌లో 50లక్షల 65వేల కోట్ల బడ్జెట్‌ పెట్టి శ్రామిక వర్గాలు, రైతు, వ్యవసాయ కూలీలు, మ ధ్య తరగతికి నిలువునా ముంచిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వే షన్‌ను సీపీఎం హర్షిస్తోందన్నారు. బీసీ జనాభా తగ్గింపు విషయం లో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. దళిత, గిరిజన, మైనారిటీ వె నుకబడిన తరగతులకు బడ్జెట్‌లో మొండిచేయి చూపిందని.. దానికి వ్యతిరేకంగా 18, 19వ తేదీల్లో గల్లీనుంచి ఢిల్లీ వరకు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్‌ కంటే రూ.30కోట్లు నిధులు తగ్గించటం దారుణమన్నా రు. 30 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు మూడున్నరకోట్ల వేల కోట్ల బడ్జెట్‌ కేటాయింపు సరికాదన్నారు. మహిళల సంక్షేమాన్ని గాలికి ఒదిలేశారు.. రైతాంగానికి బడ్జెట్‌లో ఉపశమనం లేదు.. మద్దతు ధర సబ్సిడీ, రుణమాఫీకీ ఊరట లేదని.. 13నెలలు పోరాడిన ఫలితంగా నల్లచట్టాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఆకలిచావులు పెంచేర కంగా బడ్జెట్‌ ఉందని విమర్శించారు. ఆహార సబ్సిడీ తగ్గించి, విద్య, వైద్యం వ్యాపారంగా మార్చాలని, దోపిడీ శక్తులైన పెట్టుబడి దారు లు కార్పొరేట్లకు ఏడు లక్షల కోట్లు బడ్జెట్‌ కేటాయించారన్నారు. పేద లకు, మధ్య తరగతికి 30శాతం పన్నులు విధించి వాళ్ల పీకలు వా ల్చేరకంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కార్పొరే ట్లకు 22శాతం పన్నులు విధించి, ఉద్యోగ, కార్మికులపై 30శా తం పన్నులు విధించడమంటే బీజేపీ నైజం కనపడుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. రెండు లక్షల ఉద్యో గాలు ఇస్తామన్న వాగ్దానం అమలు పరచాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్‌, భూపాల్‌, వెంకట్రాములు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ప్రముఖ న్యాయ వాది బెక్కెం జనార్దన్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు, కిల్లె గో పాల్‌, నల్లవెల్లి కురుమూర్తి, బి.చంద్రకాంత్‌, వి.పద్మ పాల్గొన్నారు.

జాన్‌వెస్లీని సన్మానించిన ప్రజా సంఘాలు

ఆదిజాంబవ అరుంధతి సంఘం, భవన నిర్మాణ కార్మికసంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మునిసిపల్‌ వర్కర్స్‌ యూని యన్‌, ఐద్వా, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సం ఘం, అవాజ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పాలమూరు యూనివర్సిటీ జేఏసీ, ఎంఎస్‌ ఎఫ్‌ నాయకులు జాన్‌వెస్లీని సన్మానించారు. అలాగే, హన్వాడ, జ డ్చర్ల, బాలానగర్‌, అడ్డాకుల, భూత్పూర్‌, రాజాపూర్‌, మహబూ బ్‌నగర్‌ పట్టణం, దేవరకద్ర దళిత సంఘాల నాయకులు, ప్రజాసం ఘాల నాయకులు తిమ్మప్ప, హనుమంతు, ఆదిలక్ష్మయ్య, సీపీఐ జి ల్లా కార్యదర్శి బి.బాలకిషన్‌లు ఆయనను సన్మానించారు.

ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మునిసిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కార్మిక సంఘం తరపున వినతి పత్రం అందజేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వా లని, ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాలని, కార్మికులందరికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయించాలని వినతిలో పేర్కొన్నారు.. మునిసిపల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకుల వెంకటేష్‌, కావలి కేశవులు, తెలుగు సత్తయ్య, కేశవులు, కృష్ణ, ఆకుల వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - Feb 16 , 2025 | 11:10 PM