విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం
ABN, Publish Date - Feb 21 , 2025 | 12:01 AM
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జోగుళాంబ గ ద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
- గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
- గట్టు బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ
గట్టు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జోగుళాంబ గ ద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గు రువారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన శాలకు వెళ్లి నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహర నాణ్యతను స్వయంగా పరిశీలించారు. భోజనం రుచిగా ఉందా అ ని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం గదిని, వంట సామగ్రి, స్టాక్‌రూంలో నిల్వ ఉంచిన బియ్యం, రాగి పప్పులు, చక్కెర, బెల్లం, ఇతర సరుకులను పరిశీలించి కాలపరిమితిని తెలుసుకున్నా రు. వంట గది శుభ్రతగా ఉండాలని ఆదే శించారు. నాసిరకమైన కూరగాయాలు, బి య్యం అందిస్తే తిరిగి పంపాలని సూచిం చారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ శోభారాణి, తహసీల్దార్ సలీముద్దీన్, స్పెషల్ ఆఫీసర్ గోవిందయ్య, షకీలాబాను, సంగీత తదితరులు ఉన్నారు.
జాబ్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి పని
జాబ్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి పని కల్పించాలని క లెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ కా ర్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. జాబ్‌కా ర్డు మంజూరు, డేటా ఎంట్రి వివరాలతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. పనుల పురోగతి పెంచాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎంపీడీవో చెన్నయ్య, ఏపీవో స్వామి పాల్గొన్నారు.
Updated Date - Feb 21 , 2025 | 12:01 AM