ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలన

ABN, Publish Date - Feb 08 , 2025 | 11:25 PM

పేట మండల పరిధిలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనాన్ని గ్రౌండ్‌ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం దత్తురావు ఆకస్మికంగా పరిశీలించారు.

జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కాంప్లెక్స్‌ హెచ్‌ఎం దత్తురావు

నారాయణపేటరూరల్‌/ఊట్కూర్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): పేట మండల పరిధిలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనాన్ని గ్రౌండ్‌ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్‌ హెచ్‌ఎం దత్తురావు ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతీరోజు మెనూ ప్రకారం భోజనం ఉండాలని, పిల్లలకు రుచికరమైన ఆకుకూరలు, కూరగాయలు చేయాలన్నారు. వంటపాత్రలు శుభ్రంగా ఉంచాలన్నారు. హెచ్‌ఎం భారతి, క్లస్టర్‌ సీఆర్పీ పవిత్ర, భానుప్రకాశ్‌ ఉన్నారు.

అదేవిధంగా ఊట్కూర్‌ మండలంలోని మల్లె పల్లి, చిన్నపొర్ల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలతో పాటు, మల్లెపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల, చిన్నపొర్ల ఉర్దూ మీడియం, తెలుగు మీడి యం ఉన్నత పాఠశాలలను శనివారం ఎంపీడీ వో ధనుంజయ్‌గౌడ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా బోధనలను పరిశీలించడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యా యుల హాజరుపట్టికలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాల న్నారు. మల్లెపల్లి హెచ్‌ఎం మోహినుద్దీన్‌, చిన్న పొర్ల ఇన్‌చార్జి హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:25 PM