ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

ABN, Publish Date - Feb 24 , 2025 | 11:30 PM

ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు సోమవారం ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు.

చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న అధికారులు

కోస్గి రూరల్‌/కోస్గి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతో కలిసి అధికారులు సోమవారం ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. గుండుమాల్‌ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు కుర్వ సత్యమ్మకు అధి కారులు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పరచి నిర్మాణ విధానాన్ని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా హౌసింగ్‌ డిప్యూటీ ఈఈ ఎం.హరికృష్ణ, ఎంపీడీవో వేణుగోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్తయ్య, గ్రామస్థులు పాల్గొ న్నారు.

అదేవిధంగా, కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో గోవిందుగౌరమ్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు భూమిపూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి విడతల వారీగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ హరికృష్ణ, ఎంపీడీవో శ్రీధర్‌, పంచాయతీ కార్య దర్శి సునీత, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, గ్రామ నాయకులు నారాయణ రెడ్డి, యాదిరెడ్డి, తూర్పు అనంతయ్య తదితరులున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 11:30 PM