ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్సెస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

ABN, Publish Date - Feb 01 , 2025 | 11:35 PM

విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలి తాలు, వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు.

ఖిల్లాఘనపురం మోడల్‌ స్కూల్‌లో అన్నాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షల్లో అత్యుత్తమ ఫలి తాలు, వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. మండలంలోని దొంతి కుంట తండా మోడల్‌ స్కూల్‌, మండల కేం ద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలను శనివా రం కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల కు అందించే భోజన వసతి, విద్యార్థుల మార్కు ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉ పాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల సూచ నలు చేశారు. మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్లు త్వరగా పూర్తి చేయాలి

మండలంలోని మామిడిమాడలో అసంపూర్తి గా ఉన్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల ్ల నిర్మాణం త్వరి తగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం నాణ్యంగా ఉగాది పండుగ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌ అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చే యాలని తహసీల్దార్‌ సుగుణకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ మల్లయ్య, తహసీల్దార్‌ సుగుణ, ఎం పీడీవో వెంకటాచారి, ఎంఈవో జయశంకర్‌, ప్రిన్సిపాల్‌ ఉమాదేవి, సాయిచరణ్‌రెడ్డి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2025 | 11:35 PM