నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు
ABN, Publish Date - Jan 23 , 2025 | 12:02 AM
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాఽధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
గోపాల్‌పేట, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాఽధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధ వారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని జ యన్న తిరుమలాపూర్‌లో నిర్వహించిన గ్రామ సభ లో ఆయన పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. సం క్షేమ పథకాల కోసం తొందర అవసరం లేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరంతరంగా కొనసాగుతోం దిన తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల్లు, ఇందిరమ్మ భరోసా మెదలైన పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టినవే అన్నారు. సంక్షేమ పథకాలను అర్హు లందరికీ అందిస్తామని భరోసా ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం, ఒక్కొక్కరికి ఆరు కేజీ ల సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. కార్య క్రమంలో తహసీల్దార్ తిలక్ కుమార్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి గోంవిదనాయక్, వివిధశాఖల అధికా రులు పాల్గొన్నారు.
Updated Date - Jan 23 , 2025 | 12:02 AM