ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీఎం చదివిన పాఠశాల భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు మంజూరు

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:21 PM

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చదివిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర జడ్పీహెచ్‌ భవన నిర్మాణానికి రూ.5కోట్లు మంజూర య్యాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదివిన తాండ్ర జిల్లా పరిషత్‌ హై స్కూల్‌

కల్వకుర్తి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చదివిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర జడ్పీహెచ్‌ భవన నిర్మాణానికి రూ.5కోట్లు మంజూర య్యాయి. ముఖ్యమంత్రి కొన్నాళ్ల క్రితం కల్వకుర్తిలో జరిగిన సభ లో తాను చదివిన స్కూల్‌కు రూ. ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి జీవో నెంబరు-3 ద్వారా రూ. ఐదు కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన ఆమోద ఉత్తర్వులు గురువారం వెలువడ్డాయి. తాండ్రలోని జడ్పీహెచ్‌ఎస్‌ అన్ని హంగులతో నిర్మాణం జరగనుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కాయితీ ఆశాదీప్‌రెడ్డి తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి గ్రామ ప్రజలు, విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:22 PM