జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాలి
ABN, Publish Date - Mar 08 , 2025 | 10:54 PM
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర మొదటి కమర్షియల్ ఫైలట్ సంజన తడకంటి అన్నారు.
- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మహిళలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ రాష్ట్ర మొదటి కమర్షియల్ ఫైలట్ సంజన తడకంటి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్టీయూ ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా సంజన తడకంటి, పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హార్షవరఽ్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తల్లి ప్రోత్సాహంతోనే ఫైలట్ శిక్షణ పూర్తిచేశానని గుర్తుచేశారు. గాల్‌రెడ్డి హర్షవరఽ్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళలు క్రమశిక్షణకు మారు పేరు అని, వారు అన్ని రంగాల్లో అంకితభావంతో పని చేస్తున్నారన్నారు. 55 మంది ఉపాధ్యాయురాళ్లను సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నాగిరెడ్డి. కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి సన్మానించారు.
యూటీఎఫ్ అధ్వర్యంలో
మహళలపై జరుగుతున్న దాడులపై పోరాడాలని ఫ్రొఫెసర్ డాక్టర్ మాలవి అన్నారు. మహిళా దిన్సోతవం సందర్భంగా యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆమె పాల్గొని, మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహిళ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు సునీల్‌కుమార్, ప్రఽధాన కార్యదర్శి బాబునాయుడు పాల్గొన్నారు. జయప్రకాశ్ నారాయణ్ ఇంజనీంగ్ కళాశాలలో మహిళ అధ్యాపకులకు ఆటల, పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు.
Updated Date - Mar 08 , 2025 | 10:54 PM