ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

ABN, Publish Date - Feb 20 , 2025 | 11:59 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నారా యణపేటకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేశారు.

మెడికల్‌ కాలేజీ దగ్గర సీఎం బహిరంగ సభా వేదికపై ఎమ్మెల్యేలు

- వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

- అప్పక్‌పల్లి మెడికల్‌ కాలేజీ దగ్గర సీఎం బహిరంగ సభ

- సింగారం చౌరస్తా దగ్గర హెలిప్యాడ్‌ ఏర్పాటు

- ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు, మల్టీజోన్‌-2 ఐజీపీ

- వెయ్యి మందితో భారీ పోలీస్‌ బందోబస్తు

నారాయణపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం నారా యణపేటకు వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేశారు. ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సీ ఎం పర్యటన ఏర్పాట్లు దగ్గరుండి అన్నీతానై మూ డురోజుల నుంచి జిల్లా యంత్రాంగానికి దిశా నిర్దే శం చేస్తూ వచ్చారు. అప్పక్‌పల్లి మెడి కల్‌ కళాశాల దగ్గర దాదాపు రూ.100కోట్లతో వివి ధ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. అక్కడే జరిగే సీ ఎం బహిరంగ సభ వేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. సభ వేదిక ఏర్పాట్లు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్‌, వంశీ కృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం తదితరులు పరిశీ లించారు. అలాగే మల్టీజోన్‌-2 ఐజీపీ సత్యనారా యణ, జోగుళాంబ జోన్‌-7 డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌తో కలిసి ముందస్తు పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సింగారం చౌరస్తా గురుకుల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి పెట్రోల్‌ బంక్‌ వరకు అక్కడి నుంచి అప్పక్‌పల్లి మెడికల్‌ కాలేజీ వరకు రూట్‌ బందోబస్తు పరిశీ లించారు. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా అప్పక్‌పల్లి శివారులో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు

సీఎం పర్యటనకోసం వెయ్యి మందితో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది పోలీ సులు, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌క ర్నూల్‌, సంగారెడ్డి ఎస్పీలతో పాటు అదనపు ఎస్పీ లు ఇద్దరు, డీఎస్‌పీలు ఆరుగురు, సీఐలు 28 మం ది, ఎస్‌ఐలు 81 మంది, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టే బుళ్లు 133, పీసీలు 750, టీఎస్‌ఎస్‌ ప్లటూన్స్‌-4 బృందాలతో పకడ్బందీగా ఎస్పీ యోగేష్‌ ఆధ్వర్యం లో భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సీఎం పర్యటన ఇలా..

ఉదయం 11:30 గంటలకు బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యా హ్నం 12 గంటలకు దూద్యాల మండలం పోలేపల్లి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ్నుంచి 12:10 నుంచి 12:25 గంటల వరకు పోలేపల్లి రేణు కా ఎల్లమ్మ దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. 12:35కి హెల్‌ప్యాడ్‌కు చేరుకొని 12:50కి నారా యణపేట సింగారం క్రాసింగ్‌ గురుకుల హాస్టల్‌ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటా రు. ఒంటి గంట నుంచి 1:15 వరకు జిల్లా మహి ళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను సింగారం చౌరస్తాలో ప్రారంభిస్తారు. కాన్వాయ్‌ ద్వారా అప్పక్‌పల్లికి చేరు కొని 1:20 నుంచి 1:30 వరకు అప్పక్‌పల్లి దగ్గర ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గువేసి ప్రారంభి స్తారు. 1:35 నుంచి 2 గంటల వరకు ప్రభుత్వ మె డికల్‌ కళాశాల, మాతా శిశు సంరక్షణ కేంద్రం, మె డికల్‌ విద్యార్థుల హాస్టల్‌ తదితర వందకోట్ల అభి వృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంత రం అప్పక్‌పల్లి మెడికల్‌ కాలేజీ దగ్గర 2:10 నుంచి 3:25 వరకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అధ్యక్షతన జరిగే బహిరంగ సభను ఉద్దేశించి సీఎం ప్రసంగి స్తారు. 3:25కి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని 4:25కి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Updated Date - Feb 20 , 2025 | 11:59 PM