ప్రతీఒక్కరు మూడు మొక్కలు నాటాలి
ABN, Publish Date - Feb 16 , 2025 | 11:28 PM
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భా గంగా ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్‌కుమార్ కోరారు.
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్‌కుమార్
గద్వాల(మల్దకల్), ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భా గంగా ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలని బీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్‌కుమార్ కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలమేరకు, ఈనెల 17న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీ ఆర్ జన్మదినం సందర్భంగా ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలోని కస్తుర్బాగాంధీ పాఠశాల లో కురువ విజయ్‌కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళా న్ని నివాసయోగంగా మార్చాలనే సంకల్పంతో మాజీ పార్లమెంట్ సభ్యుడు జోగినపల్లి సం తోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య క్ర మానికి శ్రీకారం చుట్టారన్నారని తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతీఒక్కరు మూడు మొక్కలు నాటి వాటితో సెల్ఫీ దిగి 900036 5000 నెంబర్‌కు వాట్సప్ చేయాలన్నారు. కా ర్యక్రమంలో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ గద్వాల ని యోజకవర్గం ఇన్‌చార్జి భీమన్న, మల్దకల్ రాం కుమార్, మల్దకల్ రాము, రామనర్సింహు లు, తిమ్మప్ప, నీలిపల్లి నర్సింహ, రమేష్, రవి ఉన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 11:28 PM