ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

ABN, Publish Date - Jan 02 , 2025 | 11:21 PM

విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

డీటీఎఫ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : విద్యారంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఆర్టీయూటీఎస్‌ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మధన్‌మోహన్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు బుచ్చారెడ్డి, నాయకులు గట్టు వెంకట్‌రెడ్డి, గోపాల్‌నాయక్‌, రఘురామ్‌రెడ్డి, తిమ్మారెడ్డి, జైపాల్‌రెడ్డి, అశ్వని చంద్రశేఖర్‌, రేవతి, సావిత్రి పాల్గొన్నారు. అంతకుముందు యూటీఎఫ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌, కార్యదర్శి వెంకటటేష్‌, ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, నాయకులు కిష్టయ్య, భాస్కర్‌, హేమంత్‌కుమార్‌, అజయ్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు.

ఉద్యోగులు ఐక్యమత్యంతో పనిచేయాలి

పాలమూరు : మహబూబ్‌నగర్‌ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగులు ఐక్యమత్యంతో పనిచేయాలని తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణగౌడ్‌ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్‌ మోహన్‌రావుతో కలిసి 2025 నూతన సంవత్సరం గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ క్యాలెండర్‌ ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, కార్యదర్శి వరప్రసాద్‌, రవీందర్‌, యాదగిరి, కోశాధికారి టైటస్‌పాల్‌, శ్రీనుగౌడ్‌, రాంపాల్‌, సంధ్య, డా.శివరాజు, బాలుయాదవ్‌, తానాజీ, మురళీధర్‌, డా.నరేష్‌, స్వాతి, జాకీర్‌, అహ్మద్‌, గంగాధర్‌, జగదీష్‌, జగన్మోహన్‌రెడ్డి, వీరారెడ్డి, కరణం రాజు, శ్రీనివాసులు, నాగరాజు, ఇమ్రాన్‌, చంద్రకళ పాల్గొన్నారు.

డీటీఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సరం క్యాలెండర్‌, డైరీని కలెక్టర్‌ విజయేందిర బోయి అవిష్కరించారు. డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆదిత్య, వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, వామన్‌కుమార్‌, సంధ్యారాణి పాల్గొన్నారు .

యూటీఎఫ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

మిడ్జిల్‌ : మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో గురువారం టీఎస్‌ యూటీఎఫ్‌ క్యాలెండర్‌ను ఎంఈవో సుధాకర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు, జీహెచ్‌ఎం సరస్వతి, యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటయ్య, ఉపాధ్యక్షుడు రమేష్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Jan 02 , 2025 | 11:21 PM