ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్య, వైద్యానికి పెద్దపీట

ABN, Publish Date - Feb 08 , 2025 | 11:18 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీఎంఆర్‌

- విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌, సైకిళ్ల పంపిణీ

దేవరకద్ర/చిన్నచింతకుంట ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం కౌకుంట్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు ముచ్చింతల జడ్పీహెచ్‌ఎస్‌, రాజోలి, ఇస్త్రంపల్లి గ్రామాల పదోతరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌తో పాటు ఎస్‌జీటీ ఫార్మా వారు కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అందజేసిన సైకిళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తయారు చేయాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించాలన్నారు. రూ.20 లక్షల సొంత ఖర్చుతో స్టడీ మెటీరియల్‌ను తయారు చేసి, పది విద్యార్థులకు పంపిణీ చేయటం జరుగుతోందని, విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేవరకద్రలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయటం జరిగిందని, కౌకుంట్ల మండల కేంద్రంలోనూ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు దేవరకద్ర మండలంలోని సబ్‌స్టేషన్‌ దగ్గర దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలకు ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెకట్రరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు రాఘవేందర్‌రెడ్డి, అంజిల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, దేవరకద్ర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కథలప్ప, నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎద్దుల మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:18 PM