మత్తు మర్డర్లు
ABN, Publish Date - Feb 28 , 2025 | 12:02 AM
పాలమూరు జిల్లా లో హత్యలు.. హత్యాయత్నాలు పెరుగుతున్నాయి. చిన్నచిన్న విష యాలే హత్యలకు దారితీస్తున్నాయి.
- రెండ్రోజుల్లో రెండు హత్యలు.. ఓ హత్యాయత్నం!
- జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో ఘటనలు
- గంజాయి, మద్యం మత్తే నేరాలకు కారణమా ?
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పాలమూరు జిల్లా లో హత్యలు.. హత్యాయత్నాలు పెరుగుతున్నాయి. చిన్నచిన్న విష యాలే హత్యలకు దారితీస్తున్నాయి. జిల్లాలో రెండ్రోజుల వ్యవధిలో రెండు హత్యలు జరగగా మరో హత్యాయత్నం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. గంజాయి, మద్యం మత్తులోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయి. పెట్రోలింగ్ బృందాలు ఇసుక అక్రమ రవాణా, అను మతులకు విరుద్ధంగా తరలించే స్టీల్, ఎర్రమన్ను, డీజిల్, బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగటం వంటి వాటిపైనే ఎక్కువగా దృష్టి సా రిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నెల 25న జడ్చర్లలో బిహార్‌కు చెందిన రశీద్‌ఖాన్ హత్యకు గురయ్యాడు. పరిశ్రమలో కూలీ పనిచేసే రశీద్‌ఖాన్ తోటి కూలీలతో కలిసి బీఆర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అదే గదిలో బాత్‌రూమ్‌లో హత్యకు గురయ్యాడు. ఆ మరుసటి రోజే భూత్పూర్ మండల కేంద్రం మునిరంగస్వామి దేవాలయ ప్రాంగణంలో మొల్గరకు చెందిన రంగమ్మ దారుణహత్యకు గురైంది. బండరాళ్లతో తలపై మోది హత్య చేశారు. అదేరోజు మహబూబ్‌నగర్‌లో హత్యాయత్నం జరిగింది. నగరంలోని భగీరథకాలనీ కమాన్ దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిని ఓ బాలుడు సంబంధం లేకుండా వచ్చి కత్తితో నాలుగు కత్తిపోట్లు వేశా డు. ఎందుకు దాడి చేశాడో కూడా ఇప్పటివరకు పోలీసులు ఛేదించ లేదు. ఇతను ప్రాణాపాయ పరిస్థితుల్లో హైదరాబాద్‌లో చికిత్స పొం దుతున్నాడు. ఇలా అకారణంగా చేస్తున్న దాడులు ఆందోళన కలిగిస్తు న్నాయి. గంజాయికి అలవాటు పడి మత్తులో కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గతనెల 23న ఏనుగొండలోని ఓ బార్ వద్ద ఉన్న వ్యక్తిపై కొందరు వ్యక్తులు అకారణంగా దాడి చేశారు. పిడిగుద్దులు గుద్ది, ఆయుధాలతో దాడి చేసి పరారయ్యారు. కొద్దిరోజుల క్రితం భగీరథకాలనీ వైన్స్ దగ్గర కూడా మద్యం తాగిన వ్యక్తులు గొడవ పడి కత్తులతో దాడి చేసుకు న్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నగరంలో ముగ్గురు స్నేహితులు మద్యం తాగారు. అనంతరం వారి మధ్య గొడవ జరగగా కత్తులతో దా డి చేసుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేశారు. ఇలా జిల్లాలో గంజాయి, మద్యం కారణంగా ఎక్కువగా నేరా లు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలీసులు పెట్రోలింగ్ పెంచా ల్సిన అవసరం ఉంది. రాత్రివేళ కొందరు యువకులు బైపాస్, రాయి చూరు-హై దరాబాద్ ప్రధాన రహదారిపై బైక్ రేసింగ్‌లకు పాల్ప డుతున్నారు. విపరీతంగా సౌండ్ చేస్తూ బైక్‌లపై కట్‌లు కొడుతూ, బీటీపై సైడ్‌స్టాండ్‌లను రాస్తూ నిప్పులు రాజేస్తూ స్టంట్‌లు చేస్తూ రహదారిపై వెళ్లే తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
Updated Date - Feb 28 , 2025 | 12:02 AM