కుటుంబాన్ని మరవొద్దు
ABN, Publish Date - Jan 28 , 2025 | 11:21 PM
వాహనదారులు రోడ్కెక్కేటడు మీ కోసం ఎదురుచూసే కుటుంబం ఇంటి వద్ద ఉందన్న విషయం మరవొద్దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : వాహనదారులు రోడ్కెక్కేటడు మీ కోసం ఎదురుచూసే కుటుంబం ఇంటి వద్ద ఉందన్న విషయం మరవొద్దని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపించాలని కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలోని అల్మాస్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీస్, వెస్టర్స్ ఆంధ్ర టోల్వేన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన ప్రాణాలకు మనమే భద్రత కల్పించుకోవాలని, నిబంధనలు పాటిస్తే ఇబ్బందులు ఉండవని, వాటిని అతిక్రమిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రతీ ఒక్కరు విధిగా ఆరోగ్య భీమా చేయించుకోవాలని వాహనదారులకు సూచించారు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ఓవర్‌లోడ్, రాష్ డ్రైవింగ్ మంచిది కాదన్నారు. ప్రభుత్వం విద్య, వైద ్యం కోసం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రతీ ఆటోడ్రైవర్, క్యాబ్ డ్రైవర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తానని, మీ పిల్లల చదువులకు, వైద్యం కోసం సాయం చేస్తానన్నారు. డీటీసీ కిషన్, ఎంవీఐ వాసుదేవ్, వర్టికల్ డీఎస్పీ సుదర్శన్, ట్రాఫిక్ సీఐ భగవంత్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి, ఐఎన్టీయూసీ రాములుయాదవ్ పాల్గొన్నారు.
సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలి
మహబూబ్‌నగర్ టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు పేరుతో చేపట్టబోయే సాంస్కృతిక ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో స్థానిక బాలుర కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించనున్న సాంస్కృతిక ఉత్సవాల పోస్టరును మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరిసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మునిసిసల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
Updated Date - Jan 28 , 2025 | 11:21 PM