ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పత్తి రైతులు మోసపోకుండా చూడాలి

ABN, Publish Date - Jan 23 , 2025 | 11:32 PM

జిల్లాలో సీడ్‌ పత్తి సాగుచేస్తున్న రైతులు మో సానికి, దోపిడీకి గురికాకుండా అధికారులు అ డ్డుకట్ట వేయాలని నడిగడ్డ హక్కుల పోరాట స మితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ కోరారు.

ఎన్‌హెచ్‌పీఎస్‌ జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌

గద్వాలటౌన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీడ్‌ పత్తి సాగుచేస్తున్న రైతులు మో సానికి, దోపిడీకి గురికాకుండా అధికారులు అ డ్డుకట్ట వేయాలని నడిగడ్డ హక్కుల పోరాట స మితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ కోరారు. రై తులకు జరుగుతున్న అన్యాయంపై తాము కొం తకాలంగా పోరాటం చేస్తుండగా కంపెనీలు, ఆర్గనైజర్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో రై తులను మోసగించేందుకు చేస్తున్న ప్రయత్నా లను నియంత్రించాలన్నారు. గురువారం పట్ట ణంలోని యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంజిత్‌కుమార్‌ మాట్లాడారు. రైతులు పండించిన సీడ్‌ పత్తిని జిన్నింగ్‌ కోసం సేకరించిన ఆర్గనైజర్లు సీడ్‌ ఫె యిల్‌ కాకున్న ఫెయిల్‌ అయ్యాయంటూ తప్పు డు సమాచారం ఇచ్చి రైతులను నిండా ముం చేందుకు ప్రయత్నిస్తుండటం దుర్మార్గమన్నారు. తమ పోరాట సమితి ఎప్పటికప్పుడు మోసాల ను ఎండగడుతూ ఉన్నతాధికారుల దృష్టికి తె స్తున్నా దోపిడీ విధానాలు, పద్దతులు మార్చడం తప్పా దోపిడీ, మోసం ఆగకపోవడం విచారక రమన్నారు. ఈ క్రమంలో సంబంధిత అధికా రుల నుంచి సానుకూల స్పందన లేకుంటే తా ము ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. గడిచిన ఏడేళ్లుగా ఫెయిల్‌ అయిన విత్తనాలను ఇప్పటివరకు రైతులకు అప్పగించకపోవడంలో కంపెనీల ఆంతర్యం ఏమిటని నిలదీశారు. కా గా, విత్తన పత్తి సాగుచేస్తున్న రైతులతో త్వర లోనే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పూ ర్తి వివరాలను, భవిష్యత్‌ పోరాట ప్రణాళికను సిద్ధం చేస్తామన్నారు. సమావేశంలో పోరాట సమితి కన్వీనర్‌ బుచ్చిబాబు, నాయకులు విష్ణు, రంగస్వామి, భూపతినాయు డు, గోపాల్‌, గోవిందు ఉన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 11:32 PM