ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీరు

ABN, Publish Date - Jan 24 , 2025 | 12:02 AM

ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్య మని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు.

మాట్లాడుతున్న ఎంపీ డీకే అరుణ

- మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ

- ప్రధానమంత్రి అమృత్‌ యోజన ప్రారంభం

ఆత్మకూరు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్య మని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. వన పర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ప్రధానమంత్రి అమృత్‌ యోజన పథకం 2.0 ద్వారా 12 లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించే పథకానికి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోదీ పట్టణాలు, పల్లెలు సురక్షితంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి ప్రతి పట్టణంలో శుద్ధజలం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ పథకం ద్వారా పట్టణంలోని పది వార్డులలో పది వాట ర్‌ ట్యాంకులను నిర్మించి నిరంతరం శుద్ధ జ లం అందివ్వనున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించే ప్రతి పథకంలో కేంద్ర ప్రభు త్వం వాటా ఉందని గుర్తు చేశారు.

మభ్య పెట్టేందుకే గ్రామసభలు

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు కోరినప్పటికీ.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడం తప్పా మరొకటి కాదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నిక లు వస్తున్న కారణంగా గ్రామసభలు పెట్టి మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుప త్రిలో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తామంటూ మంచాలను ప్రారంభించే వారిని ఎక్కడా చూడలేదని విమర్శించారు.

Updated Date - Jan 24 , 2025 | 12:03 AM